
పనీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతి కూర తినడం కూడా ఆరోగ్యకరమే. శీతా కాలంలో హెల్దీగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో ఎక్కువగా జలుబు, దగ్గు, వైరస్‌లు ఎటాక్ చేసే అవకాశం ఉందిది. కాబట్టి ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన ఈ పన్నీర్ మేతి మసాలా కర్రీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ కర్రీ చేయడం కూడా సులభమే. మరి ఈ పనీర్ మేతి మసాలా కర్రీ ఎలా తయారు చేస్తారు? ఈ కర్రీ చేసేందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.
పనీర్ మేతి మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు:
పన్నీర్, మెంతి కూర, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి, చాట్ మాసాలా, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆయిల్, నెయ్యి.
పనీర్ మేతి మసాలా కర్రీ తయారీ విధానం:
ముందుగా ఓ కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి.. శుభ్రం చేసిన మెంతి ఆకుల్ని వేసి పచ్చి వాసన పోయే దాకా వేయించుకోవాలి. ఆ తర్వాత దీన్ని దీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో పచ్చి మిర్చి, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, కొద్దిగా కారం వేసి అన్నీ వేయించాలి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. చల్లారాక పేస్టులా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో కొద్దిగా నెయ్యి, నూనె వేసి.. కట్ చేసి ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి.
ఆ నెక్ట్స్ టమాటాను ప్యూరీలా చేసి ఓ రెండు నిమిషాలు అయినా ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి కూడా వేసి ఫ్రై చేయాలి. దీంతో కర్రీ గ్రేవీలా అవుతుంది. ఇప్పుడు ఫ్రై చేసిన మెంతి ఆకులు, పనీర్ ముక్కలు కూడా ఓసారి కలిపి.. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి.. ఓ కప్పు వేడి నీటిని వేసి కూడా వేసి కలపాలి. ఇలా కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు గరం మసాలా వేసి ఆయిల్ పైకి తేలేకా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ మేతి మసాలా కర్రీ సిద్ధం.