Pawan Kalyan: ‘ఆమె నటన అంటే చాలా ఇష్టం’.. తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్పేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్

Pawan Kalyan: ‘ఆమె నటన అంటే చాలా ఇష్టం’.. తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్పేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. యానిమల్ ఫేమ్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగ జేబుగా మరో కీలక పాత్ర పోషించాడు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా జులై 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా రూ. వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కాగా ఎప్పుడూ లేంది పవన్ కల్యాణ్ స్వయంగా హరి హర వీరమల్లు సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఓ రాపిడ్ ఫైర్ లో పవన్ కల్యాణ్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. అలియా భట్, దీపిక, కృతి సనన్, కియారా అద్వానీలో ఎవరి నటన ఇష్టమని పవన్ కల్యాణ్ ను అడగ్గా.. తనకు అందరి నటన నచ్చుతుందన్నారు. అయితే వీరిలో ఒకరి పేరు ఎంచుకోవాలని యాంకర్ అడిగితే కృతి సనన్ పేరు చెప్పారు పవన్.

ఆ తర్వాత కృతి సనన్, కంగనా రౌనత్ ఇద్దరిలో ఎవరి నటన అంటే ఇష్టం అనే ప్రశ్న కూడా ఎదురయింది. దీనికి కంగనా అని సమాధానమిచ్చారు పవన్. ఇందిరాగాంధీ పాత్రలో ఆమె యాక్టింగ్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. అయితే ఓవరాల్ గా… అలనాటి హీరోయిన్ శ్రీదేవి నటన అంటే తనకు ఇష్టమని పవన్ వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హరి హర వీరమల్లు బ్లాక్ బస్టర్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *