పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన స్వాగ్, మేనరిజం అంటే అటు అబ్బాయిలు.. ఇటు అమ్మాయిలు పడిచచ్చిపోతారు. ఇటీవలే హరి హర వీరమల్లు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు పవన్. బ్రో సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల్లో ఉండిపోయిన పవన్.. ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో పవన్ పక్కన ఉన్న ఓ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో. ఇంతకీ అతడు ఎవరో తెలుసా..?
పైన ఫోటోలో పవన్ కళఅయాణ్ పక్కనే ఉన్న పిల్లాడు ఇప్పుడు క్రేజీ హీరో.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
ఇవి కూడా చదవండి
ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో సోలో హీరోగా అలరిస్తున్నాడు. మరోవైపు పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఈ పిల్లాడు మరెవరో కాదండి.. హీరో విరాజ్ అశ్విన్. మాయాపేటిక సినిమాతో జనాలను అలరించాడు. ఆ తర్వాత బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత తెలుగులో థ్యాంక్యూ బ్రదర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
ఆ తర్వాత సోలో హీరోగా వాళ్లిద్దరి మధ్య, మనసానమ వంటి చిత్రాల్లో నటించాడు. వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ విరాజ్ అశ్విన్ కెరీర్ మార్చింది మాత్రం బేబీ సినిమా. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..