‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియదు మీకు.. పక్కకు జరగండి’’ అంటూ అసహనం ప్రదర్శించారు. ‘‘ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. OG అంటే.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. ‘OG OG’ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకొన్న అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చాను. ‘హరిహర వీరమల్లు’ మరో ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని చిత్రాలు పూర్తి చేస్తాను’’ అని అన్నారు. అంతేకాదు, ‘‘సినిమా పరిశ్రమలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్. పరిశ్రమలోని వారందరూ కూర్చొని మాట్లాడాలి. రాష్ట్రంలో పాపికొండలు వంటి చక్కటి లొకేషన్లు ఉన్నాయి. విజయనగరం అటవీ ప్రాంతంలోనూ అందమైన ప్రదేశాలున్నాయి. ఈ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అవసరం. ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలి. స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలి. అప్పుడే మంచి సినిమాలు సాధ్యం’’ అని పవన్‌కల్యాణ్ అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.