Pesarapappu Vadalu: పెసరపప్పుతో వడలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..

Pesarapappu Vadalu: పెసరపప్పుతో వడలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..


Pesarapappu Vadalu: పెసరపప్పుతో వడలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..

సాయంత్రం అయ్యిందంటే ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో బయట ఏదో ఒక స్నాక్ పొట్టలో వేసేస్తూ ఉంటారు. కానీ కొద్దిగా శ్రమ పడితే.. ఇంట్లో తిన్న ఆహారాలే ఆరోగ్యానికి మంచివి. ఈ కాలంలో వేటిల్లో ఏం కలుపుతున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పెసర పప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. పెసర అట్లు తిని బోర్ కొట్టేవాళ్లు.. పెసర పప్పుతో వడలు కూడా వేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పప్పు నానబెట్టి ఉంటే చాలు.. పది నిమిషాల్లో వేడి వేడిగా తినొచ్చు. మరి ఇంత రుచిగా ఉండే పెసర పప్పు వడలను ఎలా తయారు చేస్తారు.

పెసర పప్పు వడలకు కావాల్సిన పదార్థాలు:

పెసర పప్పు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పచ్చి మిర్చి, ఉప్పు, సోంపు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, ఇంగువ, శనగ పిండి, బేకింగ్ సోడా, ఉల్లిపాయ, ఆయిల్.

పెసర పప్పు వడలు తయారీ విధానం:

ముందుగా పెసర పప్పును ఓ నాలుగు గంటల పాటు అయినా నానబెట్టాలి. కొద్దిగా వేడి నీళ్లు పోస్తే త్వరగా నానుతుంది. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టి కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత పప్పు నానాక.. మిక్సీలోకి పెసర పప్పు, అల్లం, వెల్లుల్లి కూడా వేసి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, ఉప్పు, ముందుగా పొడి చేసిన మిరియాల పేస్ట్, పుదీనా తరుగు, సోంపు, బేకింగ్ సోడా, శనగ పిండి, కసూరి మేతి, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు పెసర పప్పు మిశ్రమం నుంచి ఒక్కో ముద్ద తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో వడలు వేసుకోవాలి. మీడియం మంట మీద రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పెసర పప్పు వడలు సిద్ధం. వీటిని టమాటా కెచప్, గ్రీన్ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *