2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం వడ్డీ పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో జమా అవుతోంది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును ఇటీవల కేంద్రం ఫైనల్ చేసింది. దీంతో వడ్డీ సొమ్ము ఎప్పుడు తమ అకౌంట్లో పడుతుందా అని ఖాతాదారులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరికి వడ్డీ జమ అయినట్లు పాస్‌బుక్‌లో అప్‌డేట్ కాగా.. కొందరికి మాత్రం వడ్డీ జమ కావాల్సి ఉంది. మరి మీ ఖాతాలో వడ్డీ డబ్బు క్రెడిట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
- UMANG యాప్‌లో ఈపీఎఫ్‌ఓ సర్వీసెస్ విభాగంలోకి వెళితే యూఏఎన్, ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆపై బ్యాలెన్స్, పాస్‌బుక్ వంటి వివరాలు కనిపిస్తాయి. అందులో చెక్ చేసుకోవచ్చు.
- EPFO పోర్టల్ www.epfindia.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి యూఏఎన్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత మెంబర్ పాస్‌బుక్‌ను ఎంపిక చేసుకుని వివరాలు తెలుసుకోవచ్చు.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 99660 44425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. ఈ నంబర్‌కు కాల్ చేయగానే ఆటోమేటిక్‌గా కాల్ డిస్‌కనెక్ట్ అవుతుంది. కాసేపటి తర్వాత పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది.
- ఎస్సెమ్మెస్ రూపంలో ఈ వివరాలు పొందాలంటే యూఏఎన్‌తో లింక్ అయిన మొబైల్ నుంచి 77382 99899 నంబర్‌కు EPFOHO ‘UAN’ అని మెసేజ్ చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి