ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (ఫిబ్రవరి 28న) న్యూఢిల్లీలో జరిగే గ్రాండ్ సూఫీ సంగీత ఉత్సవం.. జహాన్-ఎ-ఖుస్రౌ 2025లో పాల్గొంటారు. ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగే గ్రాండ్ సూఫీ సంగీత ఉత్సవం జహాన్-ఎ-ఖుస్రౌ 2025లో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం పీఎంఓ గురువారం ప్రకటనలో తెలిపింది. దేశంలోని విభిన్న కళలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి బలమైన ప్రతిపాదకుడిగా ఉన్నారు. దీనికి అనుగుణంగా, సూఫీ సంగీతం, కవిత్వం, నృత్యాలకు అంకితమైన అంతర్జాతీయ ఉత్సవం అయిన జహాన్-ఎ-ఖుస్రావులో ఆయన పాల్గొంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
జహాన్-ఎ-ఖుస్రౌ సూఫీ సంగీత ఉత్సవం.. అమీర్ ఖుస్రావు వారసత్వాన్ని జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకచోట చేర్చుతోంది. రూమి ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాన్ని 2001లో ప్రముఖ చిత్రనిర్మాత, కళాకారుడు ముజఫర్ అలీ ప్రారంభించారు. ఈ ఉత్సవం ఈ సంవత్సరం 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజుల పాటు జహాన్-ఎ-ఖుస్రౌ సూఫీ సంగీత ఉత్సవం జరుగుతుంది.
ఈ ఉత్సవంలో, ప్రధానమంత్రి TEH బజార్ (TEH- ది ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ ది హ్యాండ్‌మేడ్)ను కూడా సందర్శిస్తారు.. దీనిలో దేశవ్యాప్తంగా ఉన్న వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ క్రాఫ్ట్‌లు, ఇతర అద్భుతమైన కళాఖండాలు, హస్తకళలు, చేనేత వస్త్రాలపై లఘు చిత్రాలు మొదలైనవి ప్రదర్శించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..