PM Modi Video: ముగిసిన ప్రధాని విదేశీ పర్యటన… మోదీ ప్రసంగానికి నమీబియా పార్లమెంటులో లేచి నిలబడి చపట్లు

PM Modi Video: ముగిసిన ప్రధాని విదేశీ పర్యటన… మోదీ ప్రసంగానికి నమీబియా పార్లమెంటులో లేచి నిలబడి చపట్లు


ప్రధాని మోదీ సుదీర్ఘ విదేశీ పర్యటన ముగిసింది. 8 రోజుల పాటు ఐదు దేశాల్లో మోదీ పర్యటించారు. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో ఆయన పర్యటించి పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నమీబియా పర్యటనతో ఆయన విదేశీ టూర్‌ ముగిసింది. దీంతో ఆయన ఢిల్లీ బయలుదేరారు. బ్రెజిల్‌లో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించారు. లేటెస్ట్‌గా అత్యున్నత పౌర పురస్కారం ‘వెల్‌విచ్చియా మిరాబిలి’తో మోదీని సత్కరించింది నమీబియా ప్రభుత్వం. మోదీ అందుకున్న 27వ ఇంటర్నేషనల్ అవార్డ్ ఇది. భారతదేశంలోని 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ పురస్కారాన్ని అందుకుంటున్నానని చెప్పారు ప్రధాని మోదీ. ఇండియా-నమిబియా మధ్య ఎప్పటికీ చెక్కుచెదరని చిరకాల స్నేహం ఉందని, ఈరోజు ఇక్కడ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తనకు ఇచ్చిన పురస్కారాన్ని నమీబియా, ఇండియా ప్రజలకు అంకితమిస్తున్నానని తెలిపారు.

అంతకు ముందు బ్రెజిల్‌ టూర్‌ ముగించుకుని నమీబియా చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం లభించింది. నమీబియా గడ్డపై అడుగుపెట్టిన మోదీకి సంప్రదాయ నృత్యంతో అక్కడి కళాకారులు స్వాగతం పలికారు. డోలు వాయిస్తూ వారిని ఉత్సాహపరిచారు ప్రధాని మోదీ. నమీబియా అధ్యక్షుడు నెతుంబోతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నమీబియా మొదటి అధ్యక్షుడు దివంగత డాక్టర్ సామ్ నుజోమాకు నివాళులర్పించారు.

నమీబియా పార్లమెంట్‌లో కూడా ప్రసంగించారు ప్రధాని మోదీ. ఆ దేశ పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయంగా ఆఫ్రికాకు భారత్‌ ఎంతో విలువిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. అధికారం, ఆధిపత్యాలతో కాకుండా.. సమానత్వం, భాగస్వామ్యాలతో వర్ధిల్లే భవిష్యత్తును సృష్టించుకునేందుకు ఇరుపక్షాలూ ఐక్యంగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఆఫ్రికా కేవలం ముడిసరకు వనరుగా మిగిలిపోకుండా సుస్థిరాభివృద్ధిలో ముందుండాలని ఆకాంక్షించారు. నమీబియాతో భారత్‌కు ఉన్న బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ఆయన ప్రస్తావించారు.

నమీబియా పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం గౌరవ సూచకంగా సభ్యులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. నమీబియా పర్యటనతో ప్రధాని మోదీ విదేశీ టూర్‌ ముగిసినట్లయింది. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు.

వీడియో చూడండి:





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *