ప్రియా ప్రకాష్ వారియర్. ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన ముద్దుగుమ్మల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కుగా బిజీగా గడిపేస్తోంది. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది.
కేవలం ఒక్క వీడియో క్లిప్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను కొట్టి కుర్రకారును కట్టిపడేసింది. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ ప్రియా ప్రకాష్ కు మంచి క్రేజ్ వచ్చింది.
ఆతర్వాత మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. ఇక తెలుగులో నితిన్ హీరోగా నటించిన చెక్ అనే సినిమాతో అడుగు పెట్టింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ మలయాళ సినిమాలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది.
మొన్నామధ్య పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో చేసింది. కానీ హీరోయిన్ గా కాదు. తేజ్ సిస్టర్ గా కనిపించింది ఈ భామ. అలాగే ధనుష్ దర్శకత్వంలో వచ్చిన జాబిలమ్మనీకు అంత కోపమా సినిమా, చివరిగా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించి హిట్ అందుకుంది.
సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటోంది. హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ చిన్నది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ మతి పోగొడుతున్నాయి. బ్లూ కలర్ డ్రస్ లో అదరగొట్టేసింది.