జ్యోతిషశాస్త్రంలో రాశినాథుడికి లేదా లగ్నాధిపతికి అత్యంత ప్రాధాన్యం ఉంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ రాశినాథుడు బలం పట్టి ఉన్న పక్షంలో ఎటువంటి దోషాలున్నా పని చేయవు. అనేక విధాలుగా అనుకూలతలు కలుగుతాయి. ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభరాశులకు రాశ్యధిపతి బాగా బలంగా, అనుకూ లంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి జీవితం సంతృప్తిగా, సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
- వృషభం: రాశినాథుడైన శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్నందువల్ల ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అన్నట్టు జీవితం సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా నెరవేరు తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. జీతభత్యాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.
- కర్కాటకం: రాశినాథుడు చంద్రుడు 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఉచ్ఛపట్టడంతో పాటు గురువుతో కలవడం, ఆ తర్వాత కూడా ఆరు రోజుల పాటు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఆదాయ పరంగా, ఉద్యోగపరంగా ఈ రాశివారి జీవితం విజయవంతంగా సాగిపోతుంది. అనేక పెండింగ్ పనులు పూర్తయి ఆర్థిక లాభం కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. మన సులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది.
- కన్య: రాశినాథుడైన బుధుడు ఈ నెల 12 వరకు పంచమంలో రవితో కలిసి ఉన్నందువల్ల ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అనేక ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయ టపడే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించిన ధన లాభం కలుగు తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమర్థతను నిరూపించుకుంటారు. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.
- తుల: రాశినాథుడు శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఈ రాశివారి జీవితం నెలాఖరు వరకు నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి, వేతనాల వృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు విజయాలు, సాఫల్యాలతో సాగిపోతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
- మకరం: రాశినాథుడు శని ధన స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు ఆర్థిక సమస్యలు, రుణ బాధల నుంచి క్రమంగా విముక్తి లభించడం జరుగుతుంది. మార్చి నెలాఖరులోగా ఈ రాశివారికి ఆదాయపరంగా అనుకూలతలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు చోటు చేసుకోవడం, ఎక్కువగా శుభవార్తలు వినడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో వేతనాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ధనపరంగా బలపడతాయి.
- కుంభం: రాశినాథుడు శని స్వక్షేత్ర సంచారం వల్ల ఈ రాశివారికి సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రాధాన్యం బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. జీతభత్యాల్లో ఊహించని పెరుగుదల ఉంటుంది. అనేక ఆర్థిక, వ్యక్తి గత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.