Puberty: అబ్బాయిల్లో వచ్చే శారీరక, మానసిక మార్పులేంటి..? పేరెంట్స్ తప్పకుండా తెలుసుకోవాాల్సిందే..!

Puberty: అబ్బాయిల్లో వచ్చే శారీరక, మానసిక మార్పులేంటి..? పేరెంట్స్ తప్పకుండా తెలుసుకోవాాల్సిందే..!


Puberty: అబ్బాయిల్లో వచ్చే శారీరక, మానసిక మార్పులేంటి..? పేరెంట్స్ తప్పకుండా తెలుసుకోవాాల్సిందే..!

అమ్మాయిల్లో ప్యూబర్టీని వాళ్లకి నెలసరి స్టార్ట్‌ అవ్వడం ద్వారా గుర్తించొచ్చు. కొన్ని ఫ్యామిలీలు దీన్ని వేడుకలా చేస్తారు. అప్పుడు అబ్బాయిల మైండ్‌లో మాకు ప్యూబర్టీ ఎప్పుడు వస్తుంది..?, మాకు ఎలాంటి గుర్తింపూ ఉండదా..? అనే ప్రశ్నలు రావడం కామన్‌. సొసైటీ ఎక్కువగా అమ్మాయిల ఎదుగుదలపై ఫోకస్‌ చేసి అబ్బాయిల మార్పులను పెద్దగా పట్టించుకోకపోవడం నిరాశ పరుస్తుంది. ఈ దశలో అబ్బాయిల బాడీ, ఎమోషనల్‌ నీడ్స్‌ ను అర్థం చేసుకోవడం పేరెంట్స్‌ కు ఇంపార్టెంట్.

అబ్బాయిలకు మామూలుగా 11 ఏళ్ల వయస్సులో ప్యూబర్టీ స్టార్ట్ అవుతుంది. అయితే కొన్నిసార్లు ఇది 9 నుంచి 14 ఏళ్ల మధ్య కూడా మొదలవ్వచ్చు.. ఇది పూర్తిగా నార్మల్. ఈ టైంలో వచ్చే కొన్ని మార్పులను వాళ్లు బయటకు చెప్పకపోవచ్చు. కాబట్టి పేరెంట్స్‌ గా మీరు ముందుగానే అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

అబ్బాయిల్లో ప్యూబర్టీ ప్రారంభానికి మొదటి సంకేతం టెస్టికల్స్ సైజు పెరగడం. ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. కానీ ప్యూబర్టీ మొదలైందని దీని ద్వారా గుర్తించవచ్చు. దీని తర్వాతే ఇతర శారీరక మార్పులు ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. ప్యూబర్టీలో వచ్చే ముఖ్యమైన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శరీర ఆకృతిలో మార్పులు

మీ అబ్బాయి చిన్న పిల్లాడిలా కనిపించడం తగ్గి పెద్దవాడిలా మారతాడు. భుజాలు వెడల్పుగా అవుతాయి, ఎత్తు పెరుగుతాడు, చేతులు, కాళ్లు కండపట్టి స్ట్రాంగ్‌ గా తయారవుతాయి. బాడీ బలంగా కనిపిస్తుంది. బరువులు ఎత్తే కెపాసిటీ పెరుగుతుంది. ఇవన్నీ 11 నుంచి 13 ఏళ్ల మధ్య కనిపిస్తాయి.

పర్సనల్ హైజీన్

ఈ ఏజ్‌లో వాళ్లు బాత్‌ రూంలో ఎక్కువ టైం గడుపుతారు, అద్దం ముందు నిలబడి, ఎక్కువగా డియోడరెంట్లు వాడటం మొదలుపెడతారు. చెమట ఎక్కువ వచ్చి దుర్వాసన కూడా వస్తుంది. ఫేస్‌పై జిడ్డు పెరిగి మొటిమలు వస్తాయి. ఈ టైంలో వాళ్ల చర్మ సంరక్షణపై పేరెంట్స్ ఫోకస్ పెట్టాలి.

ప్రైవేట్ పార్ట్స్‌ లో మార్పులు

ఈ దశలో పురుషాంగం, వృషణాలు సైజు పెరుగుతాయి. ఆ భాగాల్లో వెంట్రుకల ఎదుగుదల మొదలవుతుంది. కొందరికి చిన్న తెల్లటి బుడిపెలు కనిపించవచ్చు.. ఇవి నార్మల్, కంగారు పడాల్సిన అవసరం లేదు.

నిద్రలో వీర్యస్రావం

అప్పుడప్పుడు అబ్బాయిలకు నిద్రలోనే వీర్యస్రావం (Nightfall) జరుగుతుంది.. కొన్నిసార్లు కలల వల్ల, మరికొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే. ఇది పూర్తిగా సహజమైనదే. పేరెంట్స్‌గా మీరు ఇది తప్పు కాదు అని ముందుగానే వాళ్లకి చెప్పాలి. దీని వల్ల వాళ్లకి వచ్చే గిల్టీ లేదా భయాన్ని దూరం చేయాలి.

వాయిస్‌ లో మార్పులు

ఈ ఏజ్‌లో వాళ్ల గొంతు మందంగా పెద్దవాడిలా మారుతుంది. వాళ్లు మాట్లాడినప్పుడు ఇదేం వాయిస్..? అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. ఇది ఎదుగుదలకి సంబంధించి నార్మల్ సిగ్నల్.

ఛాతిలో చిన్న మార్పులు

కొంతమంది అబ్బాయిలకు ఛాతి భాగం కొద్దిగా ఉబ్బినట్టు కనిపించవచ్చు (Gynecomastia). ఇది టెంపరరీ మాత్రమే. కొన్ని వారాల్లో లేదా నెలల్లో ఆటోమెటిక్‌ గా తగ్గిపోతుంది. కానీ ఈ మార్పు ఎక్కువ కాలం ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం మంచిది.

ఎమోషనల్, బిహేవియరల్ మార్పులు

ఈ దశలో అబ్బాయిలు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్‌ తో మామూలుగా కలవడం తగ్గుతుంది. వాళ్ల ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వాలి.. అయితే వాళ్లు దారి తప్పకుండా చూసుకోవాలి. మొబైల్ యూసేజ్, ఇంటర్నెట్ యాక్సెస్‌పై దృష్టి పెట్టడం అవసరం.

హార్మోన్ మార్పుల వల్ల మూడ్ స్వింగ్స్, కోపం, కంగారు ఉండొచ్చు. ఈ టైంలో పేరెంట్స్ ఓర్పుతో, ప్రేమతో వాళ్లకి గైడెన్స్ ఇవ్వాలి. ఇంకా చిన్నవాడిలా కాకుండా.. వాళ్లు పెద్దవాడిగా రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. ఆ గౌరవాన్ని వాళ్లకి ఇవ్వాలి.

ప్యూబర్టీ దశలో అబ్బాయిల్లో వచ్చే మార్పులు ఫిజికల్‌ గా, మెంటల్‌ గా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్‌ గా మీరు ఈ మార్పులను అర్థం చేసుకొని.. వాళ్లకి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ప్రవర్తించడం అవసరం. ఇది వాళ్ల లైఫ్‌ లో కొత్త దశకు ఎంటర్‌ అయ్యే టైం. మీ గైడెన్స్, ప్రేమ, సహనం.. ఈ దశలో వాళ్లకి బెస్ట్ సపోర్ట్‌ గా నిలుస్తాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *