Pumpkin Seeds: ఈ గింజలు రోజుకు గుప్పెడు తింటే చాలు.. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ పరార్!

Pumpkin Seeds: ఈ గింజలు రోజుకు గుప్పెడు తింటే చాలు.. ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నీ పరార్!


గుమ్మడి గింజలు.. వీటిని క్రమం తప్పకుండా మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ గింజల్లో విటమిన్ ఇ, ఫైబర్, ఐరన్, కాల్షియం, బి 2, ఫోలేట్, బీటా కెరోటిన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన బాడీకి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్ని రెగ్యులర్‌గా తింటే భయంకరమైన ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గుండె సమస్యల నుంచి తప్పించుకునేందుకు గుమ్మడిగింజల్లోని మెగ్నీషియం హెల్ప్ చేస్తుంది.  నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి గుమ్మడిగింజలు చక్కని వరం. ఎందుకంటే, ఈ గింజల్లో ట్రిప్టోఫాన్, అమైనో యాసిడ్స్ మంచి నిద్రని అందిస్తాయి. వీటితో పాటు ఇందులోని కాపర్, జింక్, సెలీనియం నిద్ర నాణ్యతను పెంచుతాయి. వీటిని తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. ఈ గుమ్మడి గింజల్లో పుష్కలంగా మెగ్నీషియం ఉంటుంది. వీటిని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతోపాటు హైబీపి కూడా తగ్గుతుంది. ఈ రెండు సమస్యలున్నవారికి గుమ్మడిగింజలు హెల్దీ స్నాక్ అని చెప్పొచ్చు. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల వంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.

బరువు తగ్గించడంలో ఫైబర్ కీ రోల్ పోషిస్తుందని అందరికీ తెలిసిందే. దీనికోసం కూరగాయలు, ఆకుకూరలు తింటారు. అయితే, వాటిని తినలేని వారు ఈ చిన్ని గింజల్ని తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, కడుపు నిండుగా ఉండి త్వరగా బరువు తగ్గుతారు. ఈ గింజలు రెగ్యులర్‌గా తింటే స్ట్రోక్, గుండె సమస్యలతో మరణాల ప్రమాదం తగ్గుతుంది. గుమ్మడిగింజల్లో పీచు, పిండి పదార్థాలు బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగ్గా చేస్తాయి. దీంతో పాటు రక్తంలో చక్కెరని తగ్గిస్తాయి. దీనికోసం రెగ్యులర్‌గా గుమ్మడి గింజల్ని తీసుకోవడం మంచిదని గుర్తుపెట్టుకోండి. గుమ్మడిగింజల్లో సహజంగానే జింక్, ఫాస్పరస్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకల్ని బలంగా చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల సంబంధిత సమస్యల్ని దూరం చేసుకోవడానికి గుమ్మడిగింజలు తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *