మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప 2 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. పుష్ప ది రైజ్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లో తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ (Allu Arjun).. పుష్ప 2తో పాన్ ఇండియా స్టార్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆ టార్గెట్‌తోనే మూడేళ్ల పాటు మరో ఆలోచన లేకుండా బన్నీ ఈ సినిమా మీద వర్క్ చేశారు.
పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత మూడేళ్ల పాటు ఓ హీరో మరో సినిమా చేయకపోవటం అంటే మామూలు రిస్క్ కాదు. బాహుబలి టైమ్‌లో ప్రభాస్ ఇలాంటి సాహసమే చేశారు. అప్పుడు ఏ రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు పుష్ప 2 విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అయ్యింది.
పుష్పరాజ్ జోరు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ గట్టిగా కనిపిస్తోంది. తొలి భాగం రిలీజ్ అయినప్పుడే పుష్పరాజ్ యాటిట్యూడ్‌కు ఉత్తరాది జనాలు గట్టిగా కనెక్ట్ అయ్యారు. అందుకే సౌత్‌లో కంటే నార్త్‌లోనే ఈ సినిమా బాగా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 విషయంలో నార్త్ మార్కెట్ మీద మేకర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు.
పుష్ప 2 ప్రమోషన్స్ దగ్గర నుంచి నార్త్ మీద మేకర్స్ సీరియస్‌గా ఫోకస్ చేశారు. తొలి ఈవెంట్‌ను పాట్నాలో నిర్వహించిన పుష్ప టీమ్.. తన టార్గెట్ ఏంటన్నది క్లారిటీ ఇచ్చేసింది. మూవీ రిలీజ్ తర్వాత అనుకున్న టార్గెట్‌ను బన్నీ ఈజీగా రీచ్ అయినట్టేనంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో ఆడియన్స్‌కు గూజ్ బంప్స్ తెప్పించే సీన్స్ చాలానే ఉన్నాయి. దీంతో నార్త్ మార్కెట్‌లో బన్నీ జోరు నెక్ట్స్ లెవల్‌లో కనిపిస్తోంది. వసూళ్ల పరంగానూ ఇదే జోరు కనిపించే ఛాన్స్ ఉందని క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.
బాలీవుడ్‌లో ఖాన్స్, కపూర్స్, బచ్చన్స్ సాధించిన రికార్డులన్నింటినీ అల్లు అర్జున్ తుడిచి పెట్టేశారు. మూవీ రిలీజైన్ తొలి రోజు రూ.72 కోట్ల షేర్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశారు. పఠాన్, జవాన్, వార్ లాంటి సినిమాలన్నింటినీ క్రాస్ చేసి టాప్ చైర్‌లో కూర్చున్నారు బన్నీ.
హిందీలో రికార్డు సృష్టించిన పుష్ప 2
HISTORY MADE in INDIAN CINEMA ❤🔥#Pushpa2TheRule is HIGHEST DAY 1 OPENING HINDI FILM EVER with a Nett of 72 CRORES 💥💥💥#RecordsRapaRapAA 🔥
RULING IN CINEMAS
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/0Ed23geibT
— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024
ఇటు సొంత మార్కెట్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేశారు బన్నీ. ఫస్ట్ డే కలెక్షన్స్ ఫైనల్ ఫిగర్స్ విషయంలో క్లారిటీ రాకపోయినా… కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.70 కోట్ల షేర్ సాధించినట్టుగా ట్రేడ్ ఎనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. దీంతో ముందు నుంచి ఊహించినట్టుగానే పుష్పరాజ్ రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరటం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.