రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్నాళ్లు గోప్యంగా ఉంచారు. ఈ జంట చాలాసార్లు కలిసి మీడియా కంట పడ్డారు. అలాగే విదేశాలకు వెళ్ళినప్పుడు ఒకే లొకేషన్ లో వేరు వేరుగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ జంట. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసే కనిపిస్తున్నారు. ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ మధ్య రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఇటీవల దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లో జరుపుకుంది రష్మిక. ఇప్పుడు రష్మిక ‘పుష్ప 2’ని విజయ్ దేవరకొండ కుటుంబానికి చూపించింది.
ఇద్దరు మెగాహీరోలతో సినిమాలు చేసింది.. ఇప్పుడు ఛాన్స్‌లు లేక ఇలా..
డిసెంబర్ 5న ‘పుష్ప 2’ సినిమా విడుదలైంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నహీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అల్లు అర్జున్ తో పోటీగా ఆమె నటించి మెప్పించింది. ఇప్పుడు రష్మిక ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ కుటుంబానికి చూపించింది.
అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో రష్మిక చిత్రాన్ని వీక్షించింది. విజయ్ దేవరకొండ తల్లి మాధవి, విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ తో కలిసి రష్మికతో పుష్ప 2 సినిమా చూసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ లేడు. అంతకు ముందు అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 ప్రీమియర్స్ చూసింది రష్మిక. ఇప్పుడు విజయ్ ఫ్యామిలీతో కలిసి మరోసారి సినిమా చూసింది. ఇక పుష్ప 2 సినిమాతో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.