Rahul Ravindran: నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి.. నటుడు రాహుల్ రవింద్రన్ ఎమోషనల్ పోస్ట్..

Rahul Ravindran: నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి.. నటుడు రాహుల్ రవింద్రన్ ఎమోషనల్ పోస్ట్..


తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రవీంద్రన్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన
తండ్రి రవీంద్రన్ నరసింహన్ మరణించారు. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు రాహుల్. కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయ్ నాన్న అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు రాహుల్ తండ్రికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని రాహుల్ రవీంద్రన్ కు అండగా నిలుస్తున్నారు.

అలాగే తన తండ్రి గురించి చెబుతూ.. తాను దర్శకత్వం వహించిన చి.ల.సౌ సినిమాను గుర్తుచేసుకున్నారు రాహుల్. “చి.ల.సౌ చిత్రానికి నేను ఓ లైన్ రాశాను. అది ఇప్పుడు భిన్నంగా అనిపిస్తుంది. నాన్న ఉన్నారులే.. అన్ని చూసుకుంటారు. అనే మాటకు విలువ నాన్నను కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తోంది.. నాకు ఈరోజు అర్ధమైంది. నాన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. మాటల్లో వివరించలేని భావాలను మనకు అందిస్తుంది. థాంక్యూ నాన్న.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ భావోద్వేగానికి గురయ్యారు రాహుల్.

ఇవి కూడా చదవండి

అందాల రాక్షసి సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న రాహుల్.. ఆ తర్వాత హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. అలాగే పలు చిత్రాల్లో విలన్ పాత్రలు సైతం పోషించారు. నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్.. సింగర్ చిన్మయి శ్రీపాదను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కవలలు ఉన్నారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *