Rajamouli: విజయేంద్రప్రసాద్‌ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళినే దర్శకత్వం వహిస్తారా?

Rajamouli: విజయేంద్రప్రసాద్‌ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళినే దర్శకత్వం వహిస్తారా?


దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 29 (వర్కింగ్‌ టైటిల్) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాపై ఓ వీడియోను అప్‌లోడ్ చేసిన రాజమౌళి.. సింహాన్ని బోనులో పెట్టి పాస్‌పోర్ట్ లాక్కున్నట్లు పరోక్షంగా చెప్పాడు. తద్వారా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని హింట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే రాజమౌళి తదుపరి సినిమా గురించి ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడారు. రాజమౌళి దర్శకత్వం వహించిన దాదాపు అన్ని చిత్రాలకు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. భారతదేశంలోని అత్యుత్తమ కథా రచయితలలో విజయేంద్రప్రసాద్ ఒకరు. ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ మినహా మిగిలిన అన్ని సినిమాలకు విజయేంద్రప్రసాద్ నే కథ అందించారు. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రాజమౌళి తదుపరి సినిమా గురించి హింట్ ఇచ్చారు.

విజయేంద్ర ప్రసాద్ సీత గురించి ఓ కథ రాసుకున్నారట. మొత్తం రామాయణాన్ని సీత కోణంలో చూపించాలన్నది ఆయన ప్రయత్నం. కోట్లాది రూపాలయ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించాలన్నది విజయేంద్ర ప్రసాద్ ప్లాన్ అట. అయితే ఆ సినిమాను రాజమౌళి స్వయంగా డైరెక్ట్ చేస్తారా.. లేక మరెవరైనా డైరెక్ట్ చేస్తారా అనేది ఇంకా డౌట్ గానే ఉంది. రాజమౌళి దర్శకత్వం వహించాలంటే కనీసం నాలుగేళ్లు అయినా ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

నిజానికి విజయేంద్ర ప్రసాద్ ఇంతకు ముందు కూడా ‘సీత’ సినిమా గురించి మాట్లాడారు. తనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ‘సీత’ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా దర్శకత్వం వహించే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెలువడనున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా నిర్మాణం కేవలం ఒక సంవత్సరంలో పూర్తవుతుందన్నారు.

విజయేంద్ర ప్రసాద్ ‘బాహుబలి’, సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ బాయిజాన్’ సహా పలు బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు రాశారు. కన్నడలో కూడా విష్ణువర్ధన్ ‘అప్పాజీ’, ‘కురుబానా రాణి’, ‘పాండు రంగ విఠల’ సినిమాలకు కథలు రాశారు.

మహేశ్ బాబు సినిమాపై రాజమౌళి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *