Ram Gopal Varma: డైరెక్టర్ ఆర్జీవీని వదలని పోలీసులు.. మరో కేసులో నోటీసులు

Ram Gopal Varma: డైరెక్టర్ ఆర్జీవీని వదలని పోలీసులు.. మరో కేసులో నోటీసులు


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోల కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ శుక్రవారం (ఫిబ్రవరి 07) విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్టేషన్‌ ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనను పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా మొత్తం 50 ప్రశ్నలు ఆర్జీవీకి సంధించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొన్ని ప్రశ్నలకు తనకు గుర్తు లేదని, తెలియదని ఆర్జీవీ రిప్లై ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు ఆలోచించుకునేందుకు మరింత సమయం ఇచ్చినా డైరెక్టర్ సరైన సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది. దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మ స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఇక విచారణ ముగియడంతో రామ్ గోపాల్ వర్మ పోలీసు స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లారు. అయితే ఇంతలోనే ఆర్జీవీకి మరో షాక్ ఇచ్చారు గుంటూరు పోలీసులు.

2019లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఈ సినిమాలోని సన్నివేశాలు తమ మనో భావాలు దెబ్బ తీసేవిధంగా ఉన్నాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నవంబర్ 29న సీఐడీ కార్యాలయంలో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశాడు. దీంతో గుంటూరు సీఐ తిరుమలరావు మరోసారి డైరెక్టర్ కు నోటీసులు జారీ చేశారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మకి నోటీసులు అందించారు.ఈనెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ కి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

నాకు ఒంగోలు అన్నా, ఒంగోలు పోలీసులన్నా చాలా ఇష్టం..

అంతకు ముందు ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణ పూర్తయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ‘నాకు ఒంగోలు అంటే చాలా ఇష్టం. ఒంగోలు పోలీసులు అంత కన్నా ఇష్టం. ఛీర్స్’ అంటూ వైన్ గ్లాసుల ఎమోజీలు పెట్టాడు వర్మ.

చెవిరెడ్డితో ఆర్జీవీ.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *