Rambha: అయ్య బాబోయ్.. రంభ కూతురిని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా.. ఫోటోస్ వైరల్..

Rambha: అయ్య బాబోయ్.. రంభ కూతురిని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా.. ఫోటోస్ వైరల్..


దక్షిణాది సినిమా ప్రపంచంలో తనదైన ముద్రవేసింది హీరోయిన్ రంభ. ఒకప్పుడు అందం, అభినయంతో ఇండస్ట్రీని శాసించిన అగ్ర కథానాయికలలో ఆమె ఒకరు. 16 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఇంకేముంది.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో వరుస అవకాశాలు అందుకుంది. నటిగా తెరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాదు.. అప్పట్లో ఆమెకు ఫాలోయింగ్ సైతం ఎక్కువగానే ఉండేది. కథానాయికగానే కాకుండా కుర్రహీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ సైతం చేసింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ తో రచ్చ చేసింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

మలేషియాలో సెటిల్ అయిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది చేసుకుంది రంభ. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించలేదు రంభ. ఫ్యామిలీతో కలిసి మలేషియాలో సెటిల్ అయిన రంభ.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటారు. ఎక్కువగా తన ఫ్యామిలీ ఫోటోస్ పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె పెద్ద కూతురు లావణ్య ఫోటోస్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. లావణ్య అచ్చం తల్లిలాగే ఎంతో అందంగా కనిపిస్తుంది. దీంతో త్వరలోనే ఆమె కథానాయికగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రంభకు ఇన్ స్టాలో దాదాపు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రంభ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తుంది. అంతేకాదు..ఇ టీవలే బుల్లితెరపై ఓ రియాల్టీ షోకు జడ్జిగా వచ్చారు. చాలా కాలం తర్వాత రంభ తెరపై సందడి చేయడం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

Rambha Fam

Rambha Fam

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *