
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం జరుగుతోంది.. బోనాలు పండుగ తరవాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి పలుకుతారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత ఎలాంటి విషయాలు వ్యక్తపరుస్తారోనని భక్తజనం ఆసక్తితో ఎదురుచూస్తోంది.
రంగం భవిష్యవాణి కోసం కుమ్మరి ఇంటి నుంచి మేళతాళాలతో పచ్చి కుండను ఆలయానికి తీసుకురానున్నారు పండితులు.. బోనాల ఉత్సవాలలో రంగం ఎంతో ప్రత్యేక ఘట్టం… కాగా.. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్ననున్నారు. రంగం అనంతరం , ఘనంగా అమ్మవారి అంబారి ఊరేగింపు జరగనుంది. సాయంత్రం పలహర బండ్ల ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు కోసం కర్ణాటక తుంకూరులోని శ్రీ కరిబసవ స్వామి మఠం నుంచి 33ఏళ్ల ఆడ ఏనుగు లక్ష్మీని తెలంగాణకు తీసుకువచ్చారు. అటవీ శాఖ చట్టాల ప్రకారం అన్ని జాగ్రత్తలతో 12వ తేదీన ఏనుగును తీసుకొచ్చారు.