స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన నటించిన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవలే పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. దీంతో ఇప్పుడు బన్నీ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత హైప్ పెరిగింది. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు డైరెక్టర్ అట్లీ. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని రూపొందించనున్నట్లు తెలిపారు. ఇదంతా పక్కన పెడితే.. అల్లు అర్జున్ ఖాతాలో ఓ సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారని మీకు తెలుసా.. ? ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ? ఎలా మిస్తైందో తెలుసుకుందామ..
గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యారు అల్లు అర్జున్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత బన్నీ వద్దకు అనేక అవకాశాలు వచ్చాయట. అందులో భద్ర ఒకటి. డైరెక్టర్ బోయపాటి శ్రీను భద్ర కథను ముందుగా అల్లు అర్జున్ కు చెప్పారట. కానీ అప్పటికే బన్నీ మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయారట. ఆ తర్వాత అదే కథను రవితేజకు చెప్పగా.. వెంటనే అంగీకరించారట. అలా భద్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బన్నీ. ఇక ఈ సినిమా కథను ఎన్టీఆర్ కు చెప్పారట. కానీ కథ వింటూనే భయపడ్డారట. ఆయన కథ చెప్పే విధానమే తనను భయపెట్టిందని.. అందుకే ఆ సినిమాను వదులుకున్నానని గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.
చివరకు అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రవితేజ హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో మీరా జాస్మిన్ కథానాయికగా నటించగా.. ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..