రెజీనా కాసాండ్రా.. తెలుగు, తమిళం,కన్నడ సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. చిన్న వయస్సులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రెజీనా, 2005లో తమిళ చిత్రం “కండా నాల్ ముదల్”తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.
తెలుగులో “శివ మనసులో శృతి” (2012) ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు “సైమా ఉత్తమ తొలి చిత్ర నటి” అవార్డు కూడా వచ్చింది. రెజీనా తెలుగులో “రొటీన్ లవ్ స్టోరీ”, “పిల్లా నువ్వు లేని జీవితం”, “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”, “పవర్” వంటి సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
తమిళంలో “కేడి బిల్లా కిల్లాడి రంగా”, “మానగరం” వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రశంసలు పొందింది.ఈ బ్యూటీ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటుంది. “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”లో సాంప్రదాయ అమ్మాయి, “జ్యో అచ్యుతానంద”లో డెంటల్ స్టూడెంట్, “అ”లో డ్రగ్ అడిక్ట్ వంటి పాత్రల్లో తన సత్తా చాటింది.
ఈ భామ బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది. 2019లో “ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా” చిత్రంతో హిందీలో ప్రవేశించింది. తాజాగా విడుదలైన సన్నీ డియోల్ “జాట్” చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. అలాగే, వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తన సత్తా చాటుతుంది.
రెజీనా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విభిన్న ప్రాజెక్టులతో బిజీగా ఉంది, అలాగే సోషల్ మీడియాలో కూడా తన అందమైన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది రెజీనా.