మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రేణూ దేశాయ్ బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జానీ సినిమాలోనూ కథానాయికగా కనిపించింది. కేవలం నటిగానే కాకుండా ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. కొన్ని తెలుగు సినిమాల పాటలకు ఎడిటర్ గానూ వ్యవహరించింది. అలాగే మలయాళంలో దర్శకురాలిగా ఇష్క్ వాలా లవ్ అనే సినిమాను తెరకెక్కించింది. అభిరుచిగల నిర్మాతగానూ పేరు తెచ్చుకుంది. ఇలా మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ గా పేరు తెచ్చుకుందీ అందాల తార. ఇక భర్తతో విడాకుల అనంతరం సింగిల్ మదర్ గా తన ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. సుమారు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత 2023 లో టైగర్ నాగేశ్వర రావు సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది రేణు దేశాయ్. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆమె సినిమాల్లో కొనసాగుతుందనుకున్నారు. కానీ.. టైగర్ నాగేశ్వర రావు సినిమా రిలీజై సుమారు రెండేళ్లు పూర్తయ్యాయి.. ఇప్పటిదాకా మరే సినిమాను ప్రకటించలేదీ అందాల తార. సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ తన సామాజిక సేవా కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మహిళలు, మూగజీవాల సంక్షేమం తన వంతు సహాయ సహకారాలు అందిస్తోందామె.
కొన్ని నెలల క్రితం రేణూ దేశాయ్ ఓ స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించింది . ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోన్న ఆమె తన రెగ్యులర్ అప్డేట్స్ ను అందులో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలో రేణు దేశాయ్ తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. ‘మొత్తానికి నా సర్జరీ తర్వాత నా క్యూటీస్ తో కలిసి బయటకు డిన్నర్ కు వచ్చాను’ అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో రేణు దేశాయ్ కి ఏం సర్జరీ జరిగింది? ఆమెకు ఏమైంది? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
కాగా గతంలో రేణు దేశాయ్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపింది. ఇప్పుడు అందుకు సంబంధించిన సర్జరీ ఏమైనా జరిగిందా? లేక ఇంకేదైనా సర్జరీ జరిగిందా అని నెటిజన్లు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. దీనిపై నటి రేణు దేశాయ్ క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..