Robinhood OTT: ఓటీటీలో వచ్చేస్తోన్న రాబిన్ హుడ్! నితిన్, శ్రీలీల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Robinhood OTT: ఓటీటీలో వచ్చేస్తోన్న రాబిన్ హుడ్! నితిన్, శ్రీలీల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే!


ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ మూవీ తర్వాత యూత్ స్టార్ నితిన్ , గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మరో చిత్రం రాబిన్ హుడ్. ఛలో, భీష్మ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ కుడుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆసీస్ డ్యాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించడం, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడం, పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రాబిన్ హుడ్ పై ంఅచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అయితే తీరా థియేటర్లలోకి వచ్చాక మాత్రం సినిమా పూర్తిగా నిరాశ పర్చింది. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో రిలీజైన రాబిన్ హుడ్ సినిమాకు మొదటి నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత అది అలాగే కంటిన్యూ కావడంతో సినిమాకు పెద్దగా వసూళ్లు కూడా రాలేదు. కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నా, నితిన్ , శ్రీలీల జోడీ ఆకట్టుకున్నా కథా, కథనాలు ఆడియెన్స్ ను నిరాశపర్చాయి. దీనికి తోడు డేవిడ్ వార్నర్ కొద్ది సేపు మాత్రమే కనిపించడంతో ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యారు. థియేటర్లలో నిరాశపర్చిన రాబిన్ హుడ్ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు, శాటిలైట్ హక్కులను జీ5, జీ5 తెలుగు సొంతం చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో వేసవి కానుకగా మే 10 నుంచి రాబిన్ హుడ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది. అదే రోజే జీ5 తెలుగులోనూ ఈ సినిమా టెలికాస్ట్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఒకేసారి ఓటీటీలోనూ, టీవీలోనూ!

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన రాబిన్ హుడ్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, షైన్ టైమ్ చాకో, దేవదత్ నాగే, శుభలేఖ సుధాకర్, షిజు, మైమ్ గోపీ, ఆడుకలం నరేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. క్రేజీ హీరోయిన్ కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయడం విశేషం. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు స్వరాలందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *