Rohit Sharma: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌.. రోహిత్ రిటైర్మెంట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా

Rohit Sharma: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌.. రోహిత్ రిటైర్మెంట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా


బీసీసీఐ ఎట్టకేలకు తన కేంద్ర కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. ఈసారి కూడా, BCCI A+ గ్రేడ్‌లో నలుగురు ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. ఆ నలుగురిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. అయితే, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఈ గ్రేడ్‌లో స్థానం సంపాదించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఇప్పుడు 2 ఫార్మాట్లలో మాత్రమే ఆడుతున్నారు. అయినా ఈ ఇద్దరికీ A+ గ్రేడ్ వచ్చింది. ముఖ్యంగా రోహిత్ శర్మను ఈ గ్రేడ్ లో చేర్చడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇప్పుడు, రోహిత్ శర్మకు A+ గ్రేడ్ ఇవ్వడంతో, అతని రిటైర్మెంట్ గురించి వస్తోన్న రూమర్లకు తెరపడినట్టేనని తెలుస్తోంది. నిజానికి, గత సంవత్సరం టెస్ట్ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ ప్రదర్శన దారుణంగా ఉంది . పేలవమైన ఫామ్‌తో బాధపడుతున్న రోహిత్, తన కెప్టెన్సీలో జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్ కోసం రోహిత్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి కూడా తప్పుకున్నాడు. దీని తరువాత, రోహిత్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడనే ఊహాగానాలు వచ్చాయి.

రోహిత్ ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఇప్పుడు, BCCI విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్‌తో, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడం లేదని ఒక క్లారిటీ వచ్చేసింది. జూన్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో రోహిత్ నే భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర కాంట్రాక్టు ఇచ్చే ముందు, బీసీసీఐ ఉన్నతాధికారులు రోహిత్ శర్మతో మాట్లాడి అతని భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య చర్చ తర్వాతే రోహిత్‌కు A+ గ్రేడ్ ఇచ్చి ఉండవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని ఆలోచిస్తుంటే, అతనికి బహుశా A+ గ్రేడ్ ఇచ్చే అవకాశం లేదు. కేవలం వన్డేలు మాత్రమే ఆడే ఆటగాళ్లకు సాధారణంగా ఈ విభాగంలో స్థానం లభించదు. ఈ క్రమంలో రోహిత్ A+ గ్రేడ్ అతని రిటైర్మెంట్‌ ఊహాగానాలకు తెరదించిందని భావించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *