Rohit Sharma: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై విమర్శలు! గట్టి కౌంటర్‌ ఇచ్చిన భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌

Rohit Sharma: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై విమర్శలు! గట్టి కౌంటర్‌ ఇచ్చిన భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌


రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ప్రస్తుతం ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ కోసం సిద్ధం అవుతోంది. ఈ నెల 9 అంటే ఆదివారం నాడు న్యూజిలాండ్‌తో దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం తలపనుంది టీమిండియా. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి భారత జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. మరోవైపు పటిష్టమైన సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్‌కు వచ్చింది. ఆల్రెడీ గ్రూప్‌ స్టేజ్‌లో ఒకసారి న్యూజిలాండ్‌ను ఓడించడంతో టీమిండియా మంచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అయితే.. ఒక పక్క రోహిత్‌ శర్మ తన పూర్తి ఫోకస్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై పెడితే.. కొంతమంది రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ను ప్రశ్నిస్తున్నారు. రోహిత్‌ పూర్తిగా ఫిట్‌గా లేడని, ఫీల్డ్‌లో వేగంగా కదలేకపోతున్నాడని, రన్స్‌ కూడా చేయడం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా కొంతమంది రోహిత్‌ శర్మపై విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇదే విషయంపై ఓ మీడియ ప్రతినిధి టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ప్రశ్నించగా.. రోహిత్‌ శర్మ ఎంత కష్టపడతాడో మాకు తెలుసు, అతన్ని నేను చాలా క్లోజ్‌గా చూశాను, 15 ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్న వ్యక్తి ఎలాంటి ఫిట్‌నెస్‌ మెయిటేన్‌ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోహిత్‌ శర్మ చాలా ఫిట్‌గా ఉన్నాడు, ఫైనల్లో అదరగొట్టేస్తాడంటూ సూర్య రోహిత్‌కు మద్దతు తెలిపాడు. కాగా, టీమిండియాతో పాటు ముంబై ఇండియన్స్‌ జట్టుకు కూడా రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ కలిసి ఆడతారనే విషయం తెలిసిందే. రానున్న ఐపీఎల్‌ 2025 సీజన్‌ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో కూడా రోహిత్‌, సూర్య కలిసి ముంబైకి ఆడుతున్నారు.

రోహిత్‌ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత రోహిత్‌, సూర్య కలిసి ఆడలేదు. సూర్య కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కావడంతో వాళ్లిద్దరు కలిసి బ్యాటింగ్‌ చేయలేదు. రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో మాత్రం ఆ సీన్స్‌ చూసే ఛాన్స్‌ ఉంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతానికి టీమిండియానే హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అలా అని న్యూజిలాండ్‌ను కూడా తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. గతంలో ఐసీసీ ఈవెంట్స్‌లో న్యూజిలాండ్‌ మనకు చాలా గట్టి పోటీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. రోహిత్‌ శర్మ గతంలో కూడా చెప్పాడు, తాము ఏ టీమ్‌ను కూడా లైమ్‌ తీసుకోబోమని, సో.. న్యూజిలాండ్‌పై గ్రూప్‌ స్టేజ్లో సాధించిన విజయాన్ని రిపీట్‌ చేస్తూ.. ఫైనల్‌లో కూడా టీమిండియా అదరగొట్టాలని ఆశిద్దాం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *