Romantic Movie: ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. భర్త శాడిస్ట్.. ప్రియుడితో రహస్యంగా..

Romantic Movie: ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. భర్త శాడిస్ట్.. ప్రియుడితో రహస్యంగా..


ఓటీటీల పుణ్యమా అని రకరకాల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతుంటే ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఒక భాష అని లేదు రకరకాల భాషల్లో సినిమాలు అందుబాట్లో ఉన్నాయి.  వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ మూవీస్ కు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంది. అలాంటి సినిమాలకే ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి సినిమాలనే ఎక్కువ అందుబాటులో ఉంచుతున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా రచ్చ లేపుతోంది.

ఈ సినిమా రొమాంటిక్ మూవీ మాత్రమే కాదు ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో మొగుడు పైకి మంచిగా నటిస్తూ భార్యను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. భర్త నరకం చూపిస్తుంటే ఆ భార్య మాత్రం ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ ఇద్దరి మధ్యలోకి మరో వ్యక్తి వస్తాడు. ఇదొక వెబ్ సిరీస్ ఇందులో భర్త ఓ రచయిత, సమాజంలో మంచి పేరున్న వ్యక్తి.. కానీ భార్యకు మాత్రం నరకం చూపిస్తూ ఉంటాడు. భార్యను పడక సుఖానికి వాడుకుంటూ ఉంటాడు.

పడకసుఖంలో మృగంలా రెచ్చిపోతూ ఉంటాడు. భార్యకు అది ఇష్టం ఉండదు. అతనితో విడిపోవాలి అనుకుంటుంది. కానీ అంత సాహసం చేయదు. కొన్ని రోజులకు ఆమె కూడా స్టోరీలు రాయాలనుకుంటుంది. దానికి ఓ వ్యక్తి సాయం తీసుకుంటుంది. అయితే ఈ క్రమంలో అతనికి దగ్గరవుతుంది. రచనల పేరుతో ఈ ఇద్దరు శారీరకంగా దగ్గరవుతూ ఉంటారు. ఇలా ఈ ఇద్దరూ బాగా క్లోజ్ అవుతారు. సమయం దొరికినప్పుడల్లా అదే పనిలో ఉంటారు. అయితే ఆమె భర్తకు ఎలాగైనా బుద్దిచెప్పాలనుకుంటుంది. అతను ఎంత క్రూరుడో రచనల ద్వారా చెప్పాలనుకుంటుంది. ఆతర్వాత ఏం జరిగింది.? ఈ ఇద్దరి వ్యవహారం భర్తకు తెలిసిందా.? అనేది ఈ వెబ్ సిరీస్ లో చూడాల్సిందే. ఈ సిరీస్ పేరు హజరతేన్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మిస్ అవ్వకండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *