పాన్ ఇండియా ట్రెండ్‌లో కొత్త ఈక్వేషన్స్ సెట్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ సాయి పల్లవి. ఇన్నాళ్లు భారీ సినిమా హీరోయిన్ అంటే ఉండాల్సిన క్వాలిటీస్ విషయంలో ఆడియన్స్‌కు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ లెక్కలన్ని మార్చేస్తున్నారు నేచురల్ బ్యూటీ… ఎలా అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.
ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్లో సూపర్ ఫామ్‌లో ఉన్నారు రష్మిక మందన్న. యానిమల్ సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన ఈ బ్యూటీ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు టాలీవుడ్‌తో టచ్‌లో ఉంటూనే పాన్ ఇండియా మీద ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలతో గ్లామర్ ఇమేజ్ను పర్ఫెక్ట్గా క్యారీ చేస్తున్నారు.
సమంత, పూజ హెగ్డే కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌కే ఫస్ట్ ప్రియారిటీ అంటున్నారు. సమంత డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా… గ్లామర్ ఇమేజ్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. పూజ హెగ్డే అయితే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా హీరోయిన్ అనిపించుకునేందుకే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
Sai Pallavi (2)
ఇప్పటికే రణబీర్ రామాయణంలో సీత పాత్రలో నటించేందుకు ఓకే చెప్పారు సాయి పల్లవి. తాజాగా సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో ప్లాన్ చేస్తున్న సినిమాలో కూడా సాయి పల్లవినే హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ కాంబో కూడా సెట్ అయితే, సాయి పల్లవి ఇప్పట్లో రీజినల్ సినిమాకు డేట్స్ ఇచ్చే ఛాన్సే లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు.