నేచురల్ బ్యూటీ సాయి పల్లవి రియల్ లైఫ్ క్యారెక్టర్ ప్లే చేసిన ఫస్ట్ మూవీ అమరన్. బయోగ్రాఫికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో ఓ ఆర్మీ మేజర్ భార్య ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేశారు సాయి పల్లవి.
అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నుంచి అద్భుతమైన అవార్డు దక్కించుకున్నారు ఈ బ్యూటీ. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో ఫ్యాన్ బేస్ ఉన్న దర్శకుడు మణిరత్నం.
టాప్ స్టార్స్ కూడా ఒక్కసారైనా మణిరత్నం సినిమాలో నటించాలని కోరుకుంటారు. కానీ అలాంటి మణిరత్నం ఫస్ట్ టైమ్ ఓ హీరోయిన్‌కు తాను ఫ్యాన్‌ని అంటూ కామెంట్ చేశారు.
అమరన్ ఆడియో లాంచ్ వేడుకలో ఈ కామెంట్ చేశారు మణిరత్నం. అదీ మ్యాటర్.. సాయి పల్లవి యాక్టింగ్‌కు మూవీ సెలక్షన్‌కు ఫిదా అయిన మణిరత్నం ఏకంగా ఆమెకు ఫ్యాన్‌ని అంటూ కామెంట్ చేశారు.
అంతేకాదు ఏదో ఒక రోజు ఆమెతో కలిసి వర్క్ చేస్తానంటూ ఫ్యూచర్ ప్లానింగ్‌ను రివీల్ చేశారు. మణిరత్నం లాంటి దర్శకుడు ఫ్యాన్‌ని అంటూ కామెంట్ చేయటంతో సాయి పల్లవి ఎమోషనల్ అయ్యారు.
అమరన్ వేదిక మీదే మణిరత్నం సినిమాలకు తాను ఎంత పెద్ద అభిమానినో చెప్పారు సాయి పల్లవి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగినదాన్ని ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా అంటూ మణిరత్నం ఫ్యాన్ గర్ల్ మూమెంట్స్‌ను షేర్ చేసుకున్నారు.
అమర వీరులకు నివాళులు అర్పించాకే అమరన్ ప్రమోషన్స్‌లో పాల్గొంటానని చెప్పిన సాయి పల్లవి, ఈవెంట్‌కు ముందు నేషనల్ వార్ మోమోరియల్ దగ్గర దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనికులకు నివాళి అర్పించారు.