
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది. అయితే గతకొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు. మొన్నటివరకు మాయోసైటిస్ తో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాగే ఏడాదిపాటు సమంత సినిమాలకు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత మరోసారి రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. త్వరలో సమంత పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ కొన్ని కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంది. విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందని టాక్ వినిపిస్తుంది. కాగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో రాజ్ నిడిమోరు పాపులర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో సమంత, రాజ్ నిడిమోరు కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.
తాజాగా మరోసారి సమంత రాజ్ తో కలిసి కనిపించింది. ఈ ఇద్దరూ కలిసి విదేశాల్లో పర్యటిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలోని డెట్రాయిట్ లో సామ్, రాజ్ కలిసి చట్టపట్టాలేసుకు తిరుగుతూ కనిపించారు. దాంతో సమంత, రాజ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు అనే వార్తలకు మరింత బలం వచ్చింది. దీని పై ఇప్పటి వరకు సమంత కానీ రాజ్ నిడిమోరు కానీ స్పందించలేదు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..