జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు సంచారంతో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇలా గ్రహాల గమనం సమయంలో వ్యక్తుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈ మార్చి నెలలో వివిధ గ్రహాలు తమ రాశిని వదిలి సంచరిస్తున్నాయి. ఈ గ్రహాల సంచారంతో అద్భుతమైన ఖగోళ దృశ్యాలు ఆవిష్కృతం కానున్నాయి. అంతేకాదు ఈ నెలలో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఒకటి హోలీ రోజున చంద్ర గ్రహణం కాగా.. రెండోది ఈ నెలాఖరున ఏర్పడనున్న సూర్య గ్రహణం. ఈ సూర్యగ్రహణం వందేళ్ల తర్వాత మహా అద్భుతంగా జరగనుంది.
శనిశ్వర సంచారంతో పాటు సూర్య గ్రహణం
శనిశ్వరుడు ఈ 29వ తేదీ అమావాస్య తిధిలో కుంభరాశిని విడిచి మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ రోజున సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఒకే తేదీన రెండు యాదృచ్ఛికాలు.. దాదాపు వందేళ్ల తర్వాత ఇలా జరగబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందనున్నారు. వీరు పట్టిందల్లా బాగారంగా మారుంటుంది. అదృష్టవంతులుగా మారనున్నారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
ఇవి కూడా చదవండి
మిధున రాశి: ఈ రాశి చెందిన వారిపై సూర్య గ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు శనిశ్వర సంచారం కూడా వీరికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఆర్ధికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలకు పరిష్కరం లభిస్తుంది.
ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వారికి కూడా సూర్యగ్రహణం ప్రభావం అదృష్టాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో శని రాశి మార్పు కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఏది పట్టుకున్నా బంగారంగా మారుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి సమస్యల నుంచి విముక్తి లబిస్తుంది. పిల్లలు లేని వారు శుభవార్త వింటారు.. సంతానం కలిగే అవకాశం ఉంది.
తులారాశి: ఈ రాశి వారు కూడా శని రాశి మార్పుతో పాటు సూర్య గ్రహణం కూడా అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీరు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది. ఎప్పటి నుంచో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు తమ పెట్టుబడులతో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. మొత్తానికి ఈ రాశి వారికీ ఈ సమయం శుభాలను కలిగిస్తుంది.
మీన రాశి: సూర్య గ్రహణం, శని ఈ రాశిలోకి అడుగు పెట్టనునడంతో వీరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆర్ధికంగా లాభపడతారు. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. సుఖ సంతోషాలు వీరి సొంతం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు