Schools Closed: విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!

Schools Closed: విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!


ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ను వాయు కాలుష్యం మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్వం అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి క్రమంలో ఈ పాఠశాలలను ఆన్‌లైన్ తరగతులకు మార్చవచ్చు.

జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో పొగమంచు, గాలి నాణ్యత క్షీణించిన దృష్ట్యా, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్-III మార్గదర్శకాలు శుక్రవారం (15 నవంబర్ 2024) నుండి ఢిల్లీ-NCRలో అమలు చేశారు. నవంబర్ 14న, ఢిల్లీ AQI గురువారం ఉదయం 428కి చేరుకుంది.

5వ తరగతి వరకు పాఠశాలలు మూసివేత

ఇవి కూడా చదవండి

GRAP 3వ దశ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) “తీవ్రమైన” స్థాయికి చేరుకున్నప్పుడు అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. 5వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులకు మారాలని సిఫార్సు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఆమె తన ‘X’ పోస్ట్‌లో, ‘కాలుష్య స్థాయిలు పెరుగుతున్నందున, ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు తదుపరి సూచనల వరకు ఆన్‌లైన్ తరగతులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

కాలుష్యం స్థాయిలు:

Stage I – ‘Poor’ (AQI 201-300)

Stage II – ‘Very Poor’ (AQI 301-400)

Stage III – ‘Severe’ (AQI 401-450)

Stage IV – ‘Very Severe’ (AQI >450)

GRAP 3 సమయంలో ఏం జరుగుతుంది?

నిర్మాణం, కూల్చివేతలు నిలిపివేస్తారు. అన్ని అనవసరమైన మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేస్తారు. నాన్-ఎలక్ట్రిక్, నాన్-సీఎన్‌జీ, నాన్-బీఎస్-6 డీజిల్ అంతర్రాష్ట్ర బస్సులపై నిషేధం ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలను మూసివేసి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *