Science: శాస్త్రవేత్తలు ఎలుకలపైనే ఎందుకు ప్రయోగాలు చేస్తారో తెలుసా.?

Science: శాస్త్రవేత్తలు ఎలుకలపైనే ఎందుకు ప్రయోగాలు చేస్తారో తెలుసా.?


Science: శాస్త్రవేత్తలు ఎలుకలపైనే ఎందుకు ప్రయోగాలు చేస్తారో తెలుసా.?

పరిశోధకులు నిత్యం ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. మెడిసిన్స్‌ మనుషులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి.? ఏ వ్యాధి ఎందుకు వస్తుంది లాంటి వివరాలను తెలుసుకునేందుకు నిత్యం ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. అయితే పరిశోధకులు ఇలాంటి మెడిసిన్స్‌ను నేరుగా మానవులపై కాకుండా ఎలుకలపై ప్రయోగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.

మరి భూమిపై ఇన్ని జీవులు ఉండగా ఎలుకపైనే ప్రయోగాలు చేయడానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల కోసం ఎలుకలనే ఎంచుకోవడానికి ఎంతో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలుకలు, మనుషుల ఎంతో భిన్నత్వం ఉంటుంది. కానీ జన్యువుల విషయంలో మాత్రం చాలా సారూప్యత ఉంటుంది. మనుషుల్లో, ఎలకల్లో డీఎన్‌ఏ కూడా చాలా వరకు సమానం ఉంటుంది. జీవక్రియతో పాటు మరికొన్ని వ్యవస్థలు మనుషుల్లో ఎలుకల్లో ఒకేలా ఉంటాయి.

ముఖ్యంగా మానవుల రోగనిరోధక వ్యవస్థ, మెదడు నిర్మాణం, హార్మోన్ల వ్యవస్థ, అవయవ విధులు చాలా వరకు సమానంగా ఉంటాయి. అందుకే మనుషులపై ప్రయోగాలు చేసే ముందు ఎలుకలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇదే. ప్రయోగ ఫలితాలు మానవ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుంటారు.

మనుషులు, ఎలుకల మధ్య సారూప్యత ఒక్కటే మాత్రం కాకుండా.. ఎలుకలను ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అదే ఎలుకలపై ఏ ప్రయోగం చేసినా ఫలితం వేగంగా వస్తుంది. అలాగే ఎలుకలను ప్రయోగశాలలో చాలా సులభంగా పరీక్షించవచ్చు. ఎలుకలకు అందించే ఆహారం, వాటిలో కలుగుతోన్న మార్పులు సులభంగా గుర్తించగలగడం వంటివి కూడా ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఇక ఎలుకల జీవిత కాలం చాలా తక్కువగా ఉంటుందని తెలిసిందే. ప్రయోగాలకు ఎలుకలను ఎంచుకోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఈ కారణంగానే ఎలుకలపై ఎలాంటి ప్రయోగాలు చేసినా నైతిక సమస్యలు ఉండవని చెబుతుంటారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *