నిద్ర ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. కంటికి సరిపడా నిద్రపోలేకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు తిష్టవేస్తాయి. అలాగే ఎంతసేపు నిద్రపోతామో కూడా ముఖ్యం. పగలు, రాత్రి ఎప్పుడు ఎంత నిద్రపోవాలో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. దానికోసం, కొన్ని సూత్రాలను అవలంబించడం చాలా ముఖ్యం. నిద్రకు ఓ ఫార్ములాను సూచిస్తున్నారు నిపుణులు. దీనిని అనుసరిస్తే మీరు రాత్రి త్వరగా నిద్రపోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఉదయం ఉత్సాహంగా మేల్కొనవచ్చు. ఇందుకు నిద్రవేళకు 10 గంటల ముందు కెఫిన్ (కాఫీ, టీ) తాగకూడదు. మీరు ఏదైనా తినాలనుకుంటే పడుకునే 3 గంటల ముందుగానే తినేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అలాగే ఒత్తిడిని తగ్గించడానికి, నిద్రవేళకు 2 గంటల ముందు ఆఫీసు పని లేదా ఇంటి పనులతో సహా ఏ పనినీ చేయకుండా ఉండాలి. మీ కళ్ళను రక్షించుకోవడానికి, వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పడుకునే 1 గంట ముందు మీ మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి. ఈ పద్ధతి మనస్సు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇస్తుంది. ఇది మీరు మరింత సులభంగా నిద్రపోవడానికి, ఉదయం సంతృప్తిగా మేల్కొలపడానికి సహాయపడుతుంది.
ప్రతి రోజు రాత్రి 7-9 గంటల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఆరోగ్య శ్రేయస్సుకు కీలకమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు నిద్ర సమస్యలను ఎదుర్కొంటుంటే, వీలైనంత త్వరగా నిపుణుడిని సంప్రదించడం మంచిది. లేదంటే మీ నిద్ర సమస్యలను పరిష్కరించడానికి 10-3-2-1 పద్ధతిని ప్రయత్నించవచ్చు. రోగనిరోధక ప్రతిస్పందనను పెంచడానికి సరైన నిద్ర వ్యవధి రాత్రికి 7-9 గంటలు అని బెంగళూరులోని ఇన్‌ఫాంట్రీ రోడ్‌లోని స్పార్ష్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్ నిఖిల్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.