అక్కినేని నాగ చైతన్య సతీమణి శోభిత ధూళిపాళ్ల ఆధ్యాత్మిక యాత్రలో బిజి బిజీగా ఉంటోంది. సమ్మర్ వెకేషన్ లో భాగంగా ఆమె తాజాగా తమిళనాడులో పర్యటిస్తోంది.
తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలను సందర్శించింది శోభిత. ఈ క్రమంలో తన ట్రిప్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా కుంభ కోణం, సారంగపాణి ఆలయంతో పాటు రామేశ్వర స్వామి, ఆది కుంభేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుంది శోభిత.
వీటితో పాటు ప్రముఖ కాపలీశ్వరర్ ఆలయాన్ని దర్శిచుకున్న శోభిత ధూళిపాళ్ల అక్కడున్న శిల్పసౌందర్యం చూసి ఫిదా అయ్యింది.
ప్రస్తుతం శోభిత ధూళిపాళ్ల తమిళనాడు ఆలయాల పర్యటనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి