తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్ సౌందర్య. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూనే కట్టుబొట్టు, సహజ సౌందర్య, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి .. అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. కోట్లాది మంది ఆరాధ్య దేవతగా మారిన సౌందర్య కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే 2004 ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీకి మద్దతు తెలిపేందుకు బెంగళూరు నుంచి బయలుదేరిన సౌందర్య అనుకోకుండా హెలికాప్టర్ బ్లాస్ట్ కావడంతో ఆమెతోపాటు తన సోదరుడు సైతం మృతి చెందారు. సౌందర్య మరణం యావత్ సినీ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. సౌందర్య మరణించి ఇప్పటికీ 22 సంవత్సరాలు కావొస్తుంది. ఈ క్రమంలో తాజాగా సౌందర్య మరణానికి టాలీవుడ్ హీరో మోహన్ బాబు కారణమంటూ ఓ వ్యక్తి సంచలన కామెంట్స్ చేశాడు.
సీనియర్ హీరో మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లాలో మోహన్ బాబుపై ఫిర్యాదు నమోదైంది. సౌందర్య మరణం వెనుక మోహన్ బాబు హస్తం ఉందని ఆరోపణలు చేస్తూ చిట్టిమల్లు అనే వ్యక్తి ఫిర్యాదు దాఖలు చేశాడు. సౌందర్య మరణం ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారని ఆరోపించాడు. ఈ హత్య భూ వివాదంలో జరిగిందని.. సౌందర్య, ఆమె సోదరుడు అమర్‌నాథ్‌లకు శంషాబాద్‌లో ఆరు ఎకరాల భూమి ఉందని.. ఆ భూమిని తనకు ఇవ్వాలని మోహన్ బాబు అడిగాడని.. సౌందర్య దానిని అమ్మడానికి నిరాకరించిందని.. దీంతో ఆమె హత్యకు కారణం అదే అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
సౌందర్య మరణం తర్వాత భూమిని అమ్మేయాలని మోహన్ బాబు ఆమె కుటుంబంపై ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత మోహన్ బాబు ఈ భూమిని అక్రమంగా సంపాదించాడని .. ఇప్పుడు ఫిర్యాదు చేసిన చిట్టిమల్లు పోలీసు రక్షణ కోరాడు. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అవసరమైన వృద్ధాశ్రమాలకు ఇవ్వాలని కోరాడు.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..