మరి ఈ సిరీస్ ఎలా ఉంది.? ఫస్ట్ సీజన్‌లాగా దిమ్మతిరిగేలా చేసిందా? లేదా సెకండ్ సీజన్ లాగా చప్పగా సాగిందా? తెలుసుకోవాలంటూ వాచ్ మై రివ్యూ…! స్క్విడ్ గేమ్ సీరిస్ గురించి చాలా మంది వినే ఉంటారు. కొందరు ఈ సిరీస్‌ను ఫాలో అవుతూనే ఉంటారు. అయితే స్క్విడ్ గేమ్ గురించి తెలియని వాళ్ల కోసం ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. ఇదో బిగ్ వర్షన్ ఆఫ్ బిగ్ బాస్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్‌లో లా.. ఓ రిమోట్ ఏరియాలో ఉన్న ఓ పెద్ద ఇంట్లోకి కొంత మందిని పంపించి, వారితో మనం చిన్నప్పుడు ఆడిన చిన్న చిన్న గేమ్స్ ను ఆడిస్తుంటారు. కానీ ఇక్కడ ఓడిపోతే మాత్రం అక్కడిక్కడనే షూట్ చేస్తారు. చాటుగా దాక్కున స్నైపర్స్ ఏ మాత్రం ఆలోచించకుండా… బుల్లెట్ దించేస్తారు. అలా చాలా క్రూరంగా… సాగే ఈ సిరీస్‌లో 456 నెంబర్ ఉన్న వ్యక్తి హీరో. ఫస్ట్ సీరిస్‌లో విన్నర్‌గా బతికి బట్టకట్టి.. బయటి ప్రపంచానికి వెళ్లిన ఈ హీరో… ఆటవిక ఆటలా ఉన్న ఈ స్వ్కిడ్ గేమ్‌ని ఆపడానికి.. కంకణం కట్టుకుంటాడు. డబ్బు ఆశచూపి.. ఆట పేరుతో.. మనుషులను ఈ గేమ్‌లో భాగం చేస్తున్న వారిపై యుద్ధం ప్రకటిస్తాడు. గేమ్లోకి ఎలాగైనా వెళ్లి.. ఈ సారి అందర్నీ ప్రాణాలతో బయటికి తీసుకురావాలని అనుకుంటాడు. కానీ తన మాటలు ఎవరూ వినకపోవడంతో.. గేమ్ నియమాలు కఠినంగా ఉన్న కారణంగా.. ఆటలో ముందుకు సాగుతాడు. అలా తన చుట్టూ ఉన్న వాళ్లు చనిపోవడం చూసి.. ఏం చేయలేని నిస్సహాయుడు అవుతాడు. మధ్యలో వాళ్లలో చైతన్యం నింపి ఓ గ్రూపును రెడీ చేసుకుని ఈ గేమ్‌ను నిర్వహిస్తున్న మాస్టర్ మైండ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించినా.. ఆ మాస్టర్ మైండ్ తిప్పికొడతాడు. అలా స్క్విడ్ గేమ్ సెకండ్ సీజన్ అయిపోతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైల్డ్ ఆర్టిస్ట్ దుస్థితి చూసి.. నా దగ్గరికి రారా.. అంటూ మెసేజ్ !!
కనీసం ముగ్గురు పిల్లల్ని అయిన కనండి మాహప్రభో.. మస్క్ ఆవేదన
లాయర్, క్లాసికల్ డ్యాన్సర్.. ఇంకా చాలా..! దిల్ రాజు వైఫ్‌ది దిమ్మతిరిగే బ్యాక్ గ్రౌండ్
అందం కోసం ప్రాణాల మీదికి.. పిచ్చి పని చేసిన హీరోయిన్..
పెళ్లి పేరుతో ఎవరికో నా ఆస్తి ఇవ్వలేను! అందుకే పెళ్లి చేసుకోను..