Sunrisers Hyderabad vs Lucknow Super Giants, 7th Match Report: ఐపీఎల్ 7వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ అందించిన 191 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.1 ఓవర్లలోనే సాధించింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి SRH 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టాడు.
మిచెల్ మార్ష్ 52 పరుగులకు, నికోలస్ పూరన్ 70 పరుగులకు ఔటయ్యారు. ఇద్దరినీ పాట్ కమిన్స్ పెవిలియన్‌కు పంపాడు. పురాన్ , మార్ష్ మధ్య రెండో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం ఉంది. ఐడెన్ మార్క్రామ్ 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఆయుష్ బడోని 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మహ్మద్ షమీ, ఆడమ్ జంపా తలా ఒక వికెట్ పడగొట్టారు.
జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(c), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.
ఇవి కూడా చదవండి
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.
రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్..
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: షాబాజ్, మణిమారన్ సిద్ధార్థ్, మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, ఆకాష్ మహరాజ్ సింగ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: సచిన్ బేబీ, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్.