హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీ రాముని జన్మదినోత్సవం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలోని తొమ్మిదవ రోజున జరుపుకుంటారు. ఈ రోజున దేవాలయాలలో రామచరితమానస్‌ను , సుందరాకాండను పారాయణం చేస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున రాముడు అయోధ్య రాజు దశరథుడు, కౌసల్యకి జన్మించాడు. ఈ రోజున శ్రీ రాముడిని పూజించడం, రామచరిత మానస్‌ను పఠించడం వల్ల జీవితంలోని వివిధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు శ్రీ రామ నవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా వివాహానికి సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి.
శ్రీ రామ నవమి 2025 ఎప్పుడంటే
హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాస శుక్ల పక్ష నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తిధి మరుసటి రోజు ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శ్రీ రామ నవమి ఏప్రిల్ 6న జరుపుకుంటారు.
శ్రీ రామ నవమి 2025 శుభ ముహూర్తం
హిందూ పంచాంగం ప్రకారం శ్రీ రామ నవమి రోజున పూజకు శుభ సమయం ఉదయం 11:08 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. ఈ రోజున భక్తులకు రామయ్య పూజ కోసం మొత్తం 2 గంటల 31 నిమిషాలు సమయం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
శ్రీ రామ నవమికి చేయాల్సిన పరిహారాలు
ఎవరికైనా వివాహంలో పదే పదే అడ్డంకులు ఏర్పడుతుంటే శ్రీ రామ నవమి రోజున సాయంత్రం సీతారాములకు పసుపు, గంధం , కుంకుమను సమర్పించండి. ఇలా చేయడం వల్ల వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు కోరుకున్న జీవిత భాగస్వామిని కూడా పొందవచ్చు.
ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద కోసం, రామ నవమి రోజున రామ దర్బార్‌ను పూజించి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద 11 దీపాలను వెలిగించండి.
వ్యాధుల నుంచి బయటపడటానికి రామ నవమి రోజున హనుమంతుడిని పూజించండి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక, తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం.
సంతానం కోసం ఎదురు చూసే దంపతులు శ్రీ రామ నవమి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. దానిలో కొబ్బరికాయను చుట్టి సీతాదేవి పాదాలకు సమర్పించండి. ఆ తర్వాత ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం ద్వారా దంపతులకు త్వరలో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు