రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా కూడా దాదాపు మూడు, నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేస్తాయి. అదే సినిమా హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు కలెక్షన్స్ వచ్చి పడతాయి. విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్ ఇండియాలోనే అత్యంత ఖరీదైన నటుల్లో ఒకడు. ఒకొక్క సినిమాకి భారీ రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్.. బయట చాలా సింపుల్ గా ఉంటాడు. తోటి నటీనటులకు నచ్చినంత ఫుడ్ తినిపించే ప్రభాస్.. ఆయన మాత్రం కేవలం సింపుల్ ఫుడ్ మాత్రమే తింటాడు. పెద్ద స్టార్ యాక్టర్ అయినా ఎంతో వినయంగా ప్రవర్తిస్తాడు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకుండా చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇదే విషయాన్నీ చాలా మంది సినీ తారలు చాలా సందర్భాల్లో చెప్పారు.
ఇది కూడా చదవండి : బుర్రపాడవ్వల్సిందే..! రాజారాణిలో కనిపించింది ఈమేనా..! ఇది అస్సలు ఊహించలేదు గురూ..!
ప్రభాస్‌కి చాలా ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలోనూ ప్రభాస్‌కు స్నేహితుల సర్కిల్ ఎక్కువగానే ఉంది. ప్రభాస్ సన్నిహితుల్లో తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. ప్రభాస్ ఒక్కసారిగా సూర్యని డిన్నర్‌కి పిలిచాడు. సూర్య అప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు. కంగువ’ సినిమా ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ప్రభాస్ గురించి సూర్య మాట్లాడుతూ.. ‘నాకు ప్రభాస్‌ని కలవడం చాలా ఇష్టం. ‘బాహుబలి’ సినిమా షూటింగ్ సమయంలో బయటి నుంచి ఎవరూ ఆ మూవీ సెట్ లోకి వెళ్లలేదు. కానీ నేను వెళ్ళాను. ప్రభాస్ నాకు చాలా స్వీట్ ఫ్రెండ్. ఒకసారి నన్ను భోజనానికి పిలిచాడు. ఆ రోజు వేరే పనుల వల్ల చాలా ఆలస్యమైంది. దాదాపు రాత్రి 11:30 గంటలకు ప్రభాస్‌ని కలిశాను. అప్పటి దాకా అతను కూడా తినకుండా నా కోసం ఎదురు చూసాడు. అది చూసి నేను షాక్ అయ్యాను. ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాం. మళ్లీ ప్రభాస్‌తో డిన్నర్ చేసేందుకు వెయిట్ చేస్తున్నాను’ అని అన్నారు సూర్య.
ఇది కూడా చదవండి : Jr.NTR : ఎన్టీఆర్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న నటి సుహాసిని.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు
అంతే కాకుండా ‘ప్రభాస్‌తో యాక్షన్ సినిమాలో నటించేందుకు వెయిట్ చేస్తున్నాను’ అని తెలిపారు సూర్య. సూర్య ఒక్కడే కాదు, ప్రభాస్‌తో కలిసి నటించిన పలువురు నటీనటులు ప్రభాస్ ఆతిథ్యాన్ని మెచ్చుకున్నారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రభాస్ పంపిన ఆహారాన్ని ఉంచడానికి హోటల్ లో మరో గదిని అద్దెకు తీసుకున్న అని అన్నాడు . ప్రభాస్‌కి పంపిన ఆహారంపై శృతి హాసన్ కూడా చాలాసార్లు చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.