ప్రతి ఒక్కరూ రాత్రి నిద్రపోవడం సహజం.. ఇలా నిద్రిస్తున్న సమయంలో రకరకాల కలలు రావడం సహజం. ఇలాంటి కలలు మనసులోని ఆలోచనలు, అనుభవాలు, భావోద్వేగాలకు ప్రతిబింబాలుగా
భావిస్తారు. అంతేకాదు కొన్ని కలలు భయం కలిగిస్తే.. మరికొన్ని కలలు సంతోషాన్ని కలిగిస్తాయి. అయితే ఈ కలలు మన భవిష్యత్ గురించి కొన్ని సూచనలు ఇస్తాయని స్వప్న శాస్త్రం పేర్కొంది. ముఖ్యంగా తెల్లవారు జామున వచ్చే కలలకు అర్ధం గురించి ఆలోచిస్తూ ఉంటారు. భారతీయ శాస్త్రంలో ఒక ప్రాచీన శాస్త్రం స్వప్న శాస్త్రం.. ఇది కలల అర్థాన్ని విశ్లేషిస్తుందని పేర్కొంది. అయితే కొన్ని కలల్లో జంతువులు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు కలల్లో తెల్లని జంతువులు కనిపిస్తే వాటికి కొన్ని అర్ధాలున్నాయి. ఈ రోజు మనం కలలో తెల్లని జంతువులు కనిపించడం వెనుక ఉన్న అర్ధాన్ని తెలుసుకుందాం..
- తెల్ల పాము: కలలో శ్వేత వర్ణం సర్పం కనిపిస్తే అదృష్టం మీ సొంతం అవుతుందని అర్ధం. శివుని అనుగ్రహం లభిస్తుందని అర్ధం. కలల శాస్త్రం ప్రకారం, మీరు ఈ రకమైన పాము కనిపిస్తే ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. శ్వేత సర్పం జ్ఞానం, మార్పు, పునర్జన్మ, ఆధ్యాత్మిక అభివృద్ధిని సూచిస్తుంది.
- తెల్ల గుర్రం: కలలో తెల్ల గుర్రం కనిపిస్తే అది విజయానికి చిహ్నం. విజయవంతమైన కెరీర్, సానుకూల మార్పులు, వేగవంతమైన అభివృద్ధిని సూచిస్తుంది.
- తెల్ల కుక్క: కలలో తెల్ల కుక్క కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం స్నేహం, నమ్మకం, రక్షణకు సూచన అని అర్ధం.
- తెల్ల సింహం: ఎవరి కలలోనైనా తెల్ల సింహం కనిపిస్తే కెరీర్‌లో సక్సెస్ అందుకోనున్నారని అర్థం. వ్యాపారం చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది.
- తెల్ల కుందేలు: కలలో తెల్ల కుందేలు కనిపిస్తే కుటుంబ శ్రేయస్సుకు కొత్త ప్రారంభాలకు అదృష్టాన్ని సూచిస్తుంది. అంతేకాదు ఆర్ధికంగా లాభాలను అందుకుంటారని అర్ధం.
- తెల్ల ఏనుగు: స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరి కలలోనైనా తెల్ల ఏనుగు కనిపిస్తే రాజయోగం రానుందని అర్ధం అట. మన పురాణాల ప్రకారం తెల్ల ఏనుగుని ఐరావతంగా భావిస్తారు. దేవేంద్రుడి వాహనంగా పరిగణింపబడుతోంది. అందుకే తెల్లని ఏనుగు కలలో కనిపిస్తే శక్తి, బలం, స్థిరత్వం, ఆర్థిక లాభాలను సూచిస్తుంది.
- తెల్లని నెమలి: అరుదుగా కనిపించే పక్షి.. ఎవరి కలలోనైనా తెల్లని నెమలి కనిపిస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలని స్వప్న శాస్త్రం పేర్కొంది. త్వరలోనే భారీ సాధించనున్నారని అర్ధం అట.
- తెల్ల శివలింగం: తెల్లని శివలింగం కలలో కనిపిస్తే శివుని అనుగ్రహం మీపై ఉందని అర్ధం అట. శివుడు లయకారుడు.. జ్ఞానం, విజయానికి అధిదేవత. కనుక తెల్లని శివలింగం కలలో కనిపిస్తే రానున్న కాలంలో ఒక భారీ విజయం పొడనున్నారని అర్ధం అట.
ఇవి కూడా చదవండి