Swapna Shastra: తెల్లవారుజామున కలలో ఇవి కనిపించాయా.. మీ భవిష్యత్తు బంగారుమయం అని అర్ధమట..

Swapna Shastra: తెల్లవారుజామున కలలో ఇవి కనిపించాయా.. మీ భవిష్యత్తు బంగారుమయం అని అర్ధమట..


కలలు మన ఉపచేతన మనసుకు అద్దం. చాలా సార్లు మనం ఆలోచించేది కలల రూపంలో మనకు కనిపిస్తుంది. అయితే భారతీయ సంస్కృతి.. స్వప్న శాస్త్రం ప్రకారం కలలకు లోతైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా తెల్లవారుజామున కనిపించే కలలు భవిష్యత్తుకు సంకేతంగా పరిగణించబడతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తం లేదా వేకువజామున కనిపించే శుభ కలలు చాలా ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి. మీరు ఈ కలలలో దేనినైనా చూసినట్లయితే.. మీ అదృష్టానికి తాళం తెరుచుకోబోతోందని అర్థం చేసుకోండి. స్వప్న శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున ఏ కలలను చూడటం వలన అదృష్టం కలుగుతుందో ఈ రోజు తెలుసుకుందాం..

దేవుళ్ళు, దేవతల దర్శనం
తెల్లవారుజామున కలలో ఒక దేవత లేదా దేవుడిని చూసినట్లయితే.. అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కలకు అర్ధం దేవుని ఆశీస్సులు మీతో ఉన్నాయని జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు రాబోతున్నాయని సూచిస్తుంది. రానున్న కాలంలో ఒక పెద్ద కోరిక నెరవేరడం లేదా ఏదైనా ముఖ్యమైన పనిలో విజయం సాధించడానికి సూచిక కూడా కావచ్చు.

నీటికి సంబంధించిన కలలు
కలలో శుభ్రంగా ప్రవహించే నీటిని చూడటం చాలా సానుకూలంగా పరిగణించబడుతుంది. ఇది జీవితం నుంచి ప్రతికూలత ప్రవాహాన్ని, సానుకూల శక్తి ప్రవాహాన్ని సూచిస్తుంది. కలలో నది, చెరువు లేదా సముద్రంలో స్నానం చేస్తున్నట్లు చూస్తే.. ఆ కలకు అర్ధం కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో కొత్త ఆరంభానికి సంకేతం. అయితే మురికి లేదా నిలిచిపోయిన నీరు కలలోకి వస్తే ఆది అశుభంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

పండ్లతో నిండిన చెట్టును చూడటం లేదా పండ్లు తినడం
కలలో పండ్లు నిండిన చెట్టును చూడటం లేదా పండ్లు తినడం చూడటం శుభానికి చిహ్నం. ఇది ఆర్థిక లాభం, వ్యాపారంలో పురోగతి లేదా కొత్త అవకాశం రాకకు సూచిక కావచ్చు. ముఖ్యంగా మామిడి, కొబ్బరి లేదా దానిమ్మ వంటి పండ్లను చూడటం ఆర్ధిక లాభం, విజయాన్ని సూచిస్తుంది.

పచ్చని పొలాలు లేదా పచ్చదనం
ఎవరి కలలోనైనా చుట్టూ పచ్చని పొలాలు లేదా పచ్చదనం కనిపిస్తే.. అది జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూలతకు చిహ్నం. ఇది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయని, త్వరలో మంచి ఫలితాలను పొందుతారని సూచిస్తుంది. ఇది మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవితానికి సూచిక కూడా.

ఎగురుతున్నట్లు కల వస్తే
కలలో మీరు ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపిస్తే స్వేచ్ఛ, ఆకాంక్షల నెరవేర్పు, అడ్డంకుల నుండి విముక్తిని సూచిస్తుంది. ఇటువంటి కల మీరు లక్ష్యాలను సాధించడానికి సిద్ధంగా ఉన్నారని, మిమ్మల్ని ఏదీ ఆపలేరని చూపిస్తుంది. ఇది కెరీర్ పురోగతి లేదా పెద్ద విజయాన్ని సూచిస్తుంది.

తెల్ల ఆవు లేదా ఏనుగును చూడటం
కలలో తెల్లటి ఆవును చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది సంపద, శ్రేయస్సు , పిల్లల ఆనందానికి చిహ్నం. అయితే తెల్ల ఏనుగును చూడటం శ్రేయస్సు, రాజ సుఖాలు, జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందడాన్ని సూచిస్తుంది. ఈ రెండు కలలు ఆకస్మిక లాభాలు, ప్రకాశవంతమైన అదృష్టాన్ని సూచిస్తాయి.

అద్దంలో మీ ముఖం కనిపిస్తే
కలలో మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోవడం, మీ స్పష్టమైన, అందమైన ముఖాన్ని చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఆత్మవిశ్వాసం, స్వీయ-అభివృద్ధి, వ్యక్తిగత వృద్ధిని సూచిస్తుంది. మీరు మీ సామర్థ్యాలను గుర్తిస్తున్నారని, జీవితంలో సానుకూల మార్పులు వస్తున్నాయని ఇటువంటి కల సూచిస్తుంది.

పిల్లలు ఆడుకున్నట్లు కనిపిస్తే
కలలో పిల్లలు నవ్వుతూ, ఆడుకుంటూ ఉండటం ఆనందం, అమాయకత్వంగా కనిపిస్తే.. రాబోయే ఆనందానికి ఈ కలకు చిహ్నం. ఇది ప్రసవానికి లేదా కుటుంబంలోకి కొత్త సభ్యుని రాకకు సంకేతం కావచ్చు. ఇది మీ జీవితంలో సానుకూల శక్తి, కొత్త ఆశల సంభాషణకు సూచిక కూడా.

చనిపోయిన వ్యక్తితో మాట్లాడినట్లు కనిపిస్తే
మీ కలలో మీకు తెలిసిన చనిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కనిపించినా.. అతను మీకు శుభవార్త చెప్పినా లేదా చిరునవ్వుతో మాట్లాడినా.. అది కూడా శుభసూచకంగా పరిగణించబడుతుంది. ఇది ఆ వ్యక్తి ఆశీర్వాదాలకు సంకేతం కావచ్చు. మీ పెద్దల అనుగ్రహాన్ని పొందారని ఈ కలకు అర్ధం అని స్వప్న శాస్త్రం పేర్కొంది.

వర్షం పడుతున్నట్లు చూస్తే
స్వచ్ఛమైన, చినుకులు, వర్షం కలలో కనిపిస్తే.. ఈ కలకు అర్ధం జీవితంలో కొత్త ఆరంభానికి శ్రేయస్సును సూచిస్తుంది. ఇది జీవితం నుంచి ప్రతికూలతను తొలగించి కొత్త ఆశలతో ముందుకు సాగడాన్ని సూచిస్తుంది. అంతేకాదు ఈ కల ఆర్థిక లాభాలు, మానసిక ప్రశాంతతను కూడా సూచిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *