తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. తిరునల్వేలిలో ఆదివారం పట్టపగటు 27 ఏళ్ల పాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను దారుణంగా హతమార్చారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కవిన్ ఆసుపత్రిలో ఉండగానే దుండగుడు నరికి చంపేశాడు. పోలీసుల దర్యాప్తులో పరువు హత్యగా తేల్చారు. అక్కను ప్రేమించాడని హత్య చేశాడు తమ్ముడు సుర్జిత్. సుర్జిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు సూర్జిత్ తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్లే కావడం గమనార్హం. కవిన్ దారుణ హత్య వెనుక అమ్మాయి సోదరుడితోపాటు, ఆమె తల్లిదండ్రుల హస్తం ఉందని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. దీంతో.. ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. సూర్జిత్ తల్లిదండ్రులు ఇద్దిరనీ VRలో పెట్టారు. ఈ పరువు హత్య కేసులో కింది స్థాయి కులం వారనే కోణం కూడా ఉండడంతో అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
హత్యకు గురైన కవిన్ చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సూర్జిత్ సోదరి డాక్టర్. ఓ ఆసుపత్రిలో కన్సల్టెంట్ డాక్టర్‌గా పని చేస్తుంది. ఆమెకు, కవిన్‌కి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అది ప్రేమగా మారింది. ఈ నేథ్యంలోనే ఆమె పిలిచిందనే హాస్పిటల్‌కి వెళ్లాడు కవిన్. అక్కడ కత్తితో కవిన్‌పై దాడి చేసి చంపేశాడు సూర్జిత్. హత్య తర్వాత సూర్జిత్ నేరుగా పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఈ కేసు ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది.