TATA ACE PRO: హైదరాబాద్‌లో సరికొత్త స్ఫూర్తిని రగిలించిన ఏస్ ప్రో

TATA ACE PRO: హైదరాబాద్‌లో సరికొత్త స్ఫూర్తిని రగిలించిన ఏస్ ప్రో


సమగ్ర అభివృద్ధి స్ఫూర్తితో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ – టీవీ9 నెట్‌వర్క్ హైదరాబాద్‌లో ఏస్ ప్రో అబ్ మేరీ బారీ క్యాంపెయిన్‌ను ప్రారంభించాయి. ఈవీ, పెట్రోల్, బై-ఫ్యూయల్ వేరియంట్‌లతో ఏస్ ప్రో ఔత్సాహికులకు నమ్మకమైన, లాభదాయకమైన మొబిలిటీని అందిస్తుంది. పుణే, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ప్రభావవంతమైన లాంచ్‌ల తర్వాత, హైదరాబాద్ ఎడిషన్ కొత్త ఏస్ ప్రో ను ప్రారంభించింది. టెస్ట్ డ్రైవ్‌లు, ఫైనాన్స్ డెస్క్, టాటా లీడర్‌షప్, బ్యాంకింగ్ భాగస్వాములతో ఈ ప్రొ కొనసాగింది.

దేశాభిృద్ధిలో భాగస్వాములు అయ్యేవారిని ప్రోత్సహించడమే తమ ఉద్దేశ్యమని టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ పినాకి హల్దర్ అన్నారు. ఏస్ ప్రోను అత్యంత సురక్షితమైన, అత్యంత అనువైన ఉత్పత్తిగా అభివర్ణించారు. హైదరాబాద్‌లో ఏస్ ప్రో ను ప్రారంభించడం టాటా మోటార్స్‌కు గర్వకారణమని చెప్పారు. అదే సమయంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ తెలుగు రాష్ట్రాల హెడ్ పవన్ జుపూడి ఫైనాన్సింగ్‌కు సంబంధించిన విషయాలను వివరించారు. బెస్ట్ ఫైనాన్సింగ్ ప్యాకేజీలో భాగంగా సరికొత్త స్కీమ్స్‌ను అందిస్తున్నామని తెలిపారు. ఏస్ ప్రో ఒక వాహనం కాదు.. స్మాల్ కమర్షియల్ వెహికిల్ రంగంలో ఒక విప్లవం అని కంపెనీ చెబుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *