స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో పెద్ద కంపెనీలను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్‌ను టెక్నో రూపొందించింది. ఈ ఫోన్ వచ్చే వారం స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (WMC) 2025లో ఆవిష్కరించనున్నారు. ఈ ఫోన్ టెక్నో స్పార్క్ స్లిమ్ పేరుతో లాంచ్ కానుంది. కేవలం 5.75 మిల్లీమీటర్ల మందం కలిగిన ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.
టెక్నో ఒక పత్రికా ప్రకటన ద్వారా ఫోన్ విడుదలను ప్రకటించింది. కంపెనీ WMC బూత్‌లో ఫోన్‌ను ప్రదర్శించనున్నట్లు టెక్నో ప్రకటించింది. ఈ ఫోన్‌లో 5200 mAh బ్యాటరీ, 6.78-అంగుళాల డిస్‌ప్లే కూడా ఉంటుంది. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని గతంలో ధృవీకరించారు.
టెక్నో స్పార్క్ ఫోన్:
6.78-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయి. ముందు కెమెరా 13 మెగాపిక్సెల్స్ ఉంటుంది. టెక్నో ఇంకా అధికారికంగా చిప్‌సెట్‌ను వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ CPU కూడా ఉంటుందని నివేదికలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 45-వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ పూర్తిగా రీసైకిల్ చేసిన అల్యూమినియంతో తయారు చేశారు. ఫ్రేమ్ స్టెయిన్లెస్ స్టీల్.
ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందనే దానిపై టెక్నో ఇంకా ఎటువంటి సూచన ఇవ్వలేదు. ఇది కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ చాలా కాలంగా చెబుతోంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో మరిన్ని వివరాలు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మార్చి 3 నుండి మార్చి 6 వరకు జరగనుంది. టెక్నో స్పార్క్ స్లిమ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్, ఐఫోన్ 17 ఎయిర్ వంటి వాటితో పోటీ పడనుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి