Telangana: ఒక్కరోజు టీచర్‌గా మారిన కలెక్టర్‌.. ఎక్కడ, ఎందుకో తెలుసా.?

Telangana: ఒక్కరోజు టీచర్‌గా మారిన కలెక్టర్‌.. ఎక్కడ, ఎందుకో తెలుసా.?


సాధారణంగా పై అధికారులు పాఠశాలల పర్యవేక్షనకు వస్తే వసతులు ఎలా ఉన్నాయి.? స్టూడెంట్స్‌ ఎంత మంది ఉన్నారు లాంటి వివరాలు తెలుసుకుంటారు. కానీ ఓ కలెక్టర్ మాత్రం టీచర్‌ అవతారం ఎత్తాడు. పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అంతేకాకుండా విద్యార్థుల సందేహాలను సైతం నివృత్తి చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్ ఎవరో.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అతనో ఐఏఎస్ అధికారి.. జిల్లా కలెక్టర్ గా నిత్యం ఎంతో బిజీగా ఉంటారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు క్షేత్రస్థాయి పర్యటనలతో తీరిక లేకుండా ఉంటారు. అలాంటి అధికారి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భువనగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న తీరుపై ఆరా తీశారు. ఆయన విద్యార్థులతో కలిసి కాసేపు గడిపారు.

విద్యార్థుల బాగోగులు, పఠన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. చాక్ పీస్ చేతపట్టి పదవ తరగతి విద్యార్థులకు.. కలెక్టర్ హనుమంత రావు గణిత పాఠం బోధించారు. చాలా ఓపికగా మ్యాథ్స్ పాఠాలు చెప్పారు. పాఠాలు చెప్పడమే కాదు అవి ఎంతవరకు విద్యార్థులకు అర్థమయ్యేయో అనే విషయం ఆ విద్యార్థులను ప్రశ్నలు అడిగి మరీ తెలుసు కున్నారు.

సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులను అభినందించారు. ఏకంగా జిల్లా కలెక్టరే పాఠాలు చెబుతుంటే ఆ విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చదువులో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ప్రాక్టీస్ చేయాలని, డిజిటల్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని పదవ తరగతి విద్యార్థులకు కలెక్టర్ హనుమంతరావు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *