కృష్ణ నదికి వరద కొనసాగుతుండడంతో పరివాహక గ్రామాల్లో చేపల పట్టడం జోరందుకుంది. ఈ క్రమంలోనే ఉండవెల్లి మండల పరిధిలోని మారమునగాల గ్రామ శివారులోని కృష్ణనదిలో చేపలు పట్టేందుకు జాలరులు పెద్ద ఎత్తున వెళ్లాడు. అందులో వెంకట్రాముడికి వీకెండ్ ఊహించని అనుభవం ఎదురైంది.
మారమునగాల గ్రామ శివారులోని కృష్ణనదిలో జాలరి వెంకట్రాముడు వరద ఉన్నన్ని రోజులు చేపలు పడుతుంటాడు. యథావిధిగా శనివారం ఉదయం సైతం నది లో వల విసిరాడు. కొంత సమయం గడిచాక వలను వెనక్కి లాగేందుకు ప్రయత్నం చేశాడు. అయితే వల చాలా బరువుగా అనిపించడంతో ఇవాళ పెద్ద మొత్తంలో చేపలు పడి ఉంటాయని భావించాడు. ఇక కష్టం మీదనే వలను బయటకు లాగుతుండగా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. భారీ చేప వలకు చిక్కడంతో వెంకట్రాముడు ఆశ్చర్యపోయాడు. వెంటనే మరింత బలంగా వలను బయటకు లాగాడు. మిగతా సాధారణంగా పడే చిన్న చిన్న చేపలతో పాటు గా ఓ భారీ చేప వలకు చిక్కింది. వెంటనే ఆ చేపను వల నుంచి బయటకు తీశాడు. వలలో పడిన చేప బొచ్చగా నిర్ధారించారు. ఇక భారీ చేప వలకు చిక్కడంతో మిగతా జాలర్లు, గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా చేపను తిలకించారు. తూకం వేయగా 20కిలోల పైగానే బరువు ఉంది.
అయితే భారీ చేప పడిందని ఆనందించాలో… ఆ చేపను ఎలా అమ్మాలి… ఎవరు కొంటారని జాలరి వెంకట్రాముడు కొంత ఆందోళనకు గురయ్యాడు. కానీ భారీ చేప పడిందని విషయం తెలుసుకున్న ఎనిమిది మంది మానోపాడు గ్రామస్తులు కిలో రూ.280 చొప్పున రూ.5,600కు మొత్తం చేపను కొనుగోలు చేశారు. ఇక భారీ చేప చిక్కడం… ఒక్క చేపకే పెద్దమొత్తంలో నగదు రావడంతో జాలరి వెంకట్రాముడు సంతోషంలో మునిగిపోయాడు. వీకెండ్ భారీ బోనంజతో స్టార్ట్ అయ్యిందని తోటి జాలరులు వెంకట్రాముడునీ కొనియాడారు.

Huge Fish
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి