Telangana: తాగునీటి కోసం అక్కడి చెంచుల కష్టాలు చెప్పతరమా..? ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో ఇదిగో ఇలా

Telangana: తాగునీటి కోసం అక్కడి చెంచుల కష్టాలు చెప్పతరమా..? ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో ఇదిగో ఇలా


వేసవికాలంలో చాలా మారుమూల గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంటుంది. వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి జనం నానా కష్టాలు పడుతుంటారు. మంచినీటిని తెచ్చుకోవడానికి మహిళలు మండుటెండలో నెత్తిన బిందె పెట్టుకొని మోసుకెళ్తుంటారు. ఎడ్ల బండ్లు, ఆటోలు ట్రాక్టర్ల ద్వారా సుదూర ప్రాంతాల నుండి తాగు నీటిని తెచ్చుకుంటారు.

నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పలు గ్రామాలు చెంతనే కృష్ణమ్మ ఉన్నప్పటికీ.. తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన నాగార్జునసాగర్ రిజర్వాయర్ వెనుక భాగాన చందంపేట మండలం ఉంటుంది. పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. వేసవిలో తాగునీటికి కటకట తప్పడం లేదు. ప్రతి వేసవిలో మాదిరిగానే పాత తెల్దేవర్‌పల్లి గ్రామంలోని 10 చెంచు కుటుంబాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. గ్రామ శివారులోని వ్యవసాయ బోరు బావుల నుండి నీటిని తెచ్చుకోవడానికి చెంచులు అష్ట కష్టాలు పడుతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా నీటి కోసం కుటుంబం మొత్తం నెత్తిన బిందె పెట్టుకొని మోసుకెళ్లాల్సిందే. మండు వేసవిలో గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోరు బావి నుండి నీటిని తెచ్చుకోవడానికి గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ పల్లెవాసులు పిల్లలు ఆటలాడుకునే మాదిరిగా ఉన్న ఆ వినూత్న పరికరంలో దాహార్తిని తీర్చు కుంటున్నారు. ఆర్‌టీడీ అనే స్వచ్ఛంద సంస్థ చెంచుల కోసం ప్రత్యేకంగా పరికరాన్ని తయారు చేయించారు. మండుటెండలో నెత్తిన బిందె పెట్టుకొని మహిళలు మోసుకెళ్లాల్సిన పని లేకుండా ఈ పరికరం ద్వారా ఓ డ్రమ్మును ముందుకు నెట్టుకుంటూ వెళ్లి నీటిని నింపుకొని తీసుకెళ్లొచ్చు. పాత తెల్దేవర్‌పల్లిలో సుమారు పది చెంచు కుటుంబాలకు ఆర్‌టీడీ సంస్థ నెట్టుకుంటూ వెళ్లే ఈ డ్రమ్ములను అందజేసింది. పిల్లలు ఆటాడుకునే మాదిరిగా ఉన్న ఈ డ్రమ్ములతో
వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి చెంచులు వినియోగిస్తున్నారు. గ్రామ శివారులోని వ్యవసాయ బోరుబావి నుంచి మంచినీటితో వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి ఈజీగా ఈ డ్రమ్ములు ఉపయోగపడుతున్నాయని చెంచులు చెబుతున్నారు. తమ దాహార్తిని తీర్చుతున్న ఈ డ్రమ్ములను తయారీ చేయించిన ఆర్‌టీడీ సంస్థకు చెంచు కుటుంబాలు కృతజ్ఞతలు చెబుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..  



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *