Telangana: థాంక్యూ సీఎం సార్‌..గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటి..

Telangana: థాంక్యూ సీఎం సార్‌..గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటి..


హైదరాబాద్‌లోని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమైయ్యారు. డైట్ ఛార్జీలు పెంచినందుకు విద్యార్థులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.  గురుకులాల్లో పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అందరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచినట్లు చెప్పారు. 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు.

11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. దేశ నిర్మాణంలో విద్యార్థులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తోందిన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే అకడమిక్ ఇయర్ లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయిని, అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. టాటా ఇనిస్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోందన్నారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని, విద్యార్థులు క్రీడల్లో రాణించాలని వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *