Telangana: వచ్చే నెల రోజుల్లో గ్రూప్‌ 2, 3 నియామకాలు పూర్తి చేస్తాం.. సీఎం రేవంత్‌

Telangana: వచ్చే నెల రోజుల్లో గ్రూప్‌ 2, 3 నియామకాలు పూర్తి చేస్తాం.. సీఎం రేవంత్‌


హైదరాబాద్‌, మార్చి 21: తెలంగాణ నిరుద్యోగులకు పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలోనే ఫలితాలు ఇచ్చామ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వచ్చే 30, 40 రోజుల్లో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని, ఉద్యోగాలు ఇచ్చినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని గురువారం (మార్చి 20) హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ‘బిల్డ్‌ నౌ పోర్టల్‌’ను ప్రారంభించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి సీఎం రేవంత్‌ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ..

కారుణ్య నియామకాలు క్రమం తప్పకుండా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. కారుణ్య నియామకాలు మీ హక్కు. గత ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం వల్ల నిరుద్యోగులు పదేళ్లు నష్టపోయారని, జాబ్‌ క్యాలెండర్‌తో పాటుగా కారుణ్య నియామకాలు కూడా ఇవ్వాల్సిందేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల కల మాత్రం నెరవేరలేదని అన్నారు. పోటీ పరీక్షలకు ఎక్కువగా పేదలు, బడుగుబలహీన వర్గాలవారే పోటీ పడుతున్నారనీ, నిరుద్యోగుల బాధలను ప్రజా ప్రభుత్వం గుర్తించిందనీ.. అందుకే ఏడాదిలోనే 59వేల ఉద్యోగాలు తమ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు.

నిరుద్యోగుల బాధలు తనకు తెలుసని, అందుకే ఉద్యోగ ఖాళీలను పెండింగ్‌ పెట్టొద్దని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలోనే ఫలితాలు కూడా ఇచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 2 వేలకుపైగా గ్రూప్-1, 2, 3 పోస్టులకు నియామక లేఖలు త్వరలో అందిస్తామని ప్రకటించారు. పది నెలల్లో మనం సాధించినది, గత పాలకులు పదేళ్లలో చేయలేనిదని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని మరే రాష్ట్రం ఇంత తక్కువ సమయంలో 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదని ఆయన ఎత్తి చూపారు. హైదరాబాద్‌లో పారదర్శక భవన నిర్మాణ అనుమతుల ఆమోదాల కోసం ‘బిల్డ్ నౌ’ పోర్టల్ వంటి కొత్త చొరవలను కూడా ఆయన హైలైట్ చేశారు. ఇది సమర్థవంతమైన, అవినీతి రహిత ప్రక్రియను అందిస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *