అది చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామం. స్థానిక చెరువు వద్ద ఆదివారం చెత్త క్లీన్ చేస్తున్నారు స్థానికులు. అయితే అనూహ్య రీతిలో అక్కడ శివలింగం, నంది విగ్రహం లభ్యమయ్యాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అది పురాతన శివలింగంగా భావిస్తున్నారు. విషయం తెలిసిన గ్రామంలోని జనం ఆ విగ్రహాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. విగ్రహాలు లభ్యమైన చోటనే శివాలయం నిర్మించాలని కొందరు అంటుండగా, పండితులను, పూజారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మరికొందరు అంటున్నారు.
మొన్న జనగాం జిల్లాలో కూడా…
మొన్నీమధ్య జనగామ జిల్లాలో కూడా ఉపాధి హామీ కూలి పనులు నిర్వహిస్తున్న కూలీలకు అతి పురాతన విగ్రహం లభ్యమైంది.. ఆ విగ్రహాన్ని పరిశీలించిన చరిత్ర పరిశోధకులు మధ్యయుగ నాటి విగ్రహం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. జనగామ మండలం శామీర్ పేట గ్రామ శివారులో ఈ విగ్రహం లభ్యమైంది.. ఇదే గ్రామానికి చెందిన కూలీలు ఉపాధి హామీ పనులను చేపట్టారు.. భూమిలో తవ్వకాలు చేపడుతున్న క్రమంలో కూలీలకు అకస్మాత్తుగా ఒక పురాతనమైన మనిషి రూపంలో ఉన్న విగ్రహం లభ్యమైంది.
విగ్రహం భాగం తల భాగం మాత్రమే లభ్యమైంది. ఈ విషయాన్ని మండల ఉపాధి హామీ పథకం అధికారులకు, గ్రామ శాఖ అధికారులకు కూలీలు తెలపడంతో ఆ విగ్రహాన్ని స్వాధీనపరచుకొన్నారు. అయితే ఈ విగ్రహం మధ్యయుగం నాటి విగ్రహం అయి ఉండవచ్చని చరిత్ర పరిశోధకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో ప్రాచీన కాలం నాటి పురాతన విగ్రహాలు అక్కడక్కడా లభ్యం అయ్యాయని చెబుతున్నారు.. జనగామ పరిసర ప్రాంతాల్లో మరింత లోతుగా అధ్యయనం జరిపితే పురాతన కాలం నాటి ఆనవాళ్లు మరింత లభ్యం అవుతాయని భావిస్తున్నారు.

ఉపాధి హామి పనుల్లో బయటపడ్డ విగ్రహం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి